ETV Bharat / bharat

భారత్​లోకి పాక్​ ఫ్లైట్​.. 120 కిలోమీటర్లు ప్రయాణం.. దారి తప్పి వచ్చిందట!

పాకిస్థాన్​కు చెందిన ఓ​ విమానం.. భారత గగనతలంలో ప్రవేశించి పది నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. 23వేల అడుగుల ఎత్తులో సుమారు 120 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. చివరకు ఏమైందంటే?

pakisthan flight
pakisthan flight
author img

By

Published : May 7, 2023, 6:54 PM IST

పాకిస్థాన్​ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ​ విమానం.. ల్యాండింగ్​ సమస్య వల్ల భారత్​ గగనతలంలోకి ప్రవేశించి పది నిమిషాలు పాటు చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో పైలట్​.. విమానాన్ని 23 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఓ మీడియా ప్రచురించడం వల్ల వెలుగులోకి వచ్చింది.

మీడియా కథనం ప్రకారం..
మే 4వ తేదీ పాకిస్థాన్​ ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్ 777 విమానం(పీకే 248).. మస్కట్​ నుంచి లాహోర్​కు బయలుదేరింది. అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు లాహోర్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్​ కావాల్సి ఉంది. ఆ సమయంలో లాహోర్​లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పైలట్​.. విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్ సూచనలు మేరకు పైలట్​.. గో- అరౌండ్​ విధానాన్ని ప్రారంభించాడు. లాహోర్​ పరిసరాల్లో చక్కర్లు కొట్టాడు. వర్షం భారీగా కురుస్తుండడం, తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉండడం వల్ల దారి తప్పి భారత్​లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానాన్ని 23వేల అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లాడు. పంజాబ్‌లోని తరణ్ సాహిబ్, రసూల్‌పుర్ నగరం గుండా వివిధ ప్రాంతాల్లో ప్రయాణించిన ఆ విమానం కాసేపటికి తిరిగి పాకిస్థాన్​లోని ముల్తాన్​కు చేరుకుంది. మొత్తం భారత్​ గగనతలంలో దాదాపు పది నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన పాక్​ విమానం.. 120 కిలోమీటర్లు మేర ప్రయాణించింది.

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఇంజిన్​లో మంటలు!
ఇటీవలే ఫ్లైదుబాయ్ ఎయిర్​లైన్​కు చెందిన విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. ఇంజిన్​లో సమస్యను గుర్తించిన పైలట్లు.. కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీ విమానాశ్రయం ఏటీసీ (ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్​)కి సమాచారం ఇచ్చారు. అనంతరం ఎయిర్​పోర్టు సమీపంలోకి వచ్చిన విమానం.. మంటలతో కొద్ది సేపు గాల్లో చక్కర్లు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం చక్కర్లు కొట్టిన వీడియో చూడాలనుకుంటున్నారా?.. అయితే ఇక్కడ క్లిక్​ చేయండి.

పాక్​లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​
కొద్ది నెలల క్రితం దిల్లీ నుంచి దోహాకు బయల్దేరిన విమానాన్ని పాకిస్థాన్​లో అత్యవసర ల్యాండింగ్​ చేయాల్సి వచ్చింది. ఓ ప్రయాణికుడికి అస్వస్థత తలెత్తడం వల్ల విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశారు. అయితే ఆ ప్రయాణికుడు మృతి చెందినట్లు కరాచీ విమానాశ్రయ వైద్య బృందం అధికారికంగా ప్రకటించింది. అసలేం జరుగుతుందో తెలుసుకుంటారా?.. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.