ETV Bharat / bharat

'రఫేల్​ ఒప్పందంపై భాజపా 'కవర్​-అప్'​ మరోసారి బయటపడింది'

రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో జరిగిన అవినీతిని(rafale deal corruption) మోదీ ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ అంశంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న మధ్యవర్తి పాత్రపై విచారణ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించింది. రఫేల్‌ ఒప్పందంలో అవినీతి, అక్రమార్జనను కప్పిపుచ్చేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న 'కవర్​-అప్​' మరోసారి బయటపడిందని దుయ్యబట్టింది.

Rafale deal
రఫేల్‌
author img

By

Published : Nov 9, 2021, 5:32 PM IST

రఫేల్​ ఒప్పందంలో (rafale deal) అవకతవకలకు ఆధారాలు ఉన్నాయంటూ ఫ్రాన్స్​కు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నల్ 'మీడియాపార్ట్'​ ప్రచురించిన కథనంపై కాంగ్రెస్ స్పందించింది. ఒప్పందాల్లో అవినీతిని కప్పిపుచ్చేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ 'కవర్​-అప్' మరోమారు బయటపడిందని విమర్శించింది.

రఫేల్​ ఒప్పందంలో జాతీయ భద్రత విషయంలో భాజపా ప్రభుత్వం రాజీపడిందని కాంగ్రెస్ ఆరోపించింది. భారత వైమానిక దళ ప్రయోజనాలను ప్రమాదంలోకి నెట్టడం సహా దేశ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మండిపడ్డారు. 'రఫేల్ ఒప్పందంపై జరిగిన చర్చలకు సంబంధించిన రహస్య పత్రాలను రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సుశేన్ గుప్తా అనే మధ్యవర్తి 2015లో స్వాధీనం చేసుకున్న విషయం ఇప్పుడు బటపడిందని అన్నారు. ఈ ఒప్పందంలోని అవినీతిని కప్పిపుచ్చేందుకు మోదీ ప్రభుత్వం, సీబీఐ-ఈడీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు ఖేరా.

భారత్​తో రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం(rafale deal corruption) కుదిరేలా చూసేందుకు.. దసో ఏవియేషన్​ సంస్థ భారీగా ముడుపులు ఇచ్చిందంటూ ఫ్రాన్స్​కు చెందిన 'మీడియాపార్ట్​' జర్నల్​ సంచలన వార్త ప్రచురించింది(rafale deal news). ఇందుకోసం బోగస్ ఇన్​వాయిస్​లు రూపొందించిందని వెల్లడించింది. దసో ఏవియేషన్​.. ఓ మధ్యవర్తికి 7.5మిలియన్​ యూరోల(రూ. 64.32కోట్లు) ముడుపులను రహస్యంగా అందించేందుకు ఈ ఇన్​వాయిస్​లు ఉపయోగపడ్డాయని ఆరోపించింది. బోగస్​ ఇన్​వాయిస్​కు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, భారత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టలేదని మీడియాపార్ట్​ ఆరోపించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.