Rahul gandhi on unemployment: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ సమస్యపై యువత, విద్యార్థులు ఎందుకు సత్యాగ్రహం చేయాల్సి వస్తుందో ప్రస్తుతం ఉన్న గణాంకాలే చెప్తున్నాయని విమర్శించారు. దీనిపై ఏ మాత్రం స్పందన లేని ఆ వ్యక్తి మాత్రం అహంకారంతో కళ్లు మూసుకుపోయి కూర్చున్నాడని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
దేశంలో సుమారు 3.03 కోట్ల మంది యువత నిరుద్యోగం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వచ్చిన మీడియా కథనాలపై స్పందించిన రాహుల్ కేంద్రంపై విమర్శలు చేశారు. ఈ మేరకు సంబంధిత మీడియా కథనాన్ని ట్వీట్‌కు జోడించారు. 'విద్యార్థులు ఎందుకు నిరుద్యోగంపై నిరసనలు తెలుపుతున్నారో ఇప్పుడు అర్థం అవుతోంది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏం పట్టనట్లు కళ్లు మూసుకుని కూర్చున్నారు'అని అన్నారు.
మొదటి నుంచి కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, నిరుద్యోగ కట్టడిపై రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: రాహుల్ గాంధీకి 'మోదీ ఫోబియా': అమిత్ షా