Odisha Train Tragedy : ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి రాంగ్ సిగ్నలింగ్‌తో పాటు టెలికమ్యూనికేషన్ వ్యవస్థలోని లోపాలే కారణమని ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం తేల్చింది. వివిధ స్థాయిల్లో ఈ పొరపాట్లు జరిగినట్లు రైల్వే సేఫ్టీ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే దుర్ఘటన జరిగి ఉండేది కాదని కమిటీ పేర్కొంది. గతంలో ఇదే తరహాలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని ఉంటే ఈ రైలు ప్రమాదం తప్పేదని అభిప్రాయపడింది. ప్రమాదంపై సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ విభాగం రైల్వే బోర్డుకు నివేదిక అందించింది. ఈ మేరకు ప్రమాదంపై సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ విభాగం రైల్వే బోర్డుకు దర్యాప్తు నివేదికను రైల్వే సేఫ్టీ కమిషన్ సమర్పించింది.
Odisha Train Accident Cause : రాంగ్ వైరింగ్, రాంగ్ కేబుల్ వల్ల 2022 మే 16న ఇదే తరహా దుర్ఘటన ఖరగ్‌పుర్ డివిజన్‌లోని బ్యాంక్రనాయబాజ్ స్టేషన్ వద్ద జరిగిందని నివేదిక పేర్కొంది. అప్పుడే దాన్ని సరి చేసే చర్యలు తీసుకుని.. రాంగ్ వైరింగ్ సమస్యను పరిష్కరించి ఉంటే బహనగబజార్ వద్ద ఈ ఘోర ప్రమాదం సంభవించేది కాదని అభిప్రాయపడింది. సిగ్నలింగ్-సర్క్యూట్ మార్పులో లోపాలే ప్రమాదానికి కారణమని తేల్చింది.
ఆ కోణంలో దర్యాప్తు..
దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం ఒడిశాలోని బాలేశ్వర్‌లో జూన్ 2న జరిగింది. మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఈ ఘటనలో 292 మంది ప్రాణాలు కోల్పోగా.. పన్నెండు వందల మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన రైళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇంటర్‌లాక్ వ్యవస్థలో మార్పులు జరగడం వల్లే ప్రమాదం సంభవించినట్లు అధికారులు అప్పట్లో అనుమానించారు. ఈ మార్పుల వెనుక కుట్ర కోణం ఏదైనా ఉందా అని దర్యాప్తు జరిపారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం సంబంధిత రైల్వే ఉద్యోగులను ప్రశ్నించి ప్రమాదానికి రాంగ్ సిగ్నలింగే కారణమని తేల్చింది.
ఆర్థిక నేరగాడి రూ.10కోట్ల సాయం..
మనీ లాండరింగ్ కేసులో తిహాడ్ జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్.. ఒడిశా రైలు దుర్ఘటనలో చనిపోయిన కుటుంబాలకు, గాయపడిన వారికి రూ.10 కోట్ల విరాళాన్ని ఇటీవల ప్రకటించాడు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా రైల్వే మంత్రిత్వశాఖకు లేఖ పంపించాడు. ఆ విరాళాన్ని అంగీకరించాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరాడు. ఈ పూర్తి వార్త కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.