Conjoined Twins Operation Success: ఒకే కాలేయంతో ఉదర భాగం అతుక్కుని పుట్టిన అవిభక్త కవల పిల్లల్ని శస్త్రచికిత్స చేసి విజయవంతంగా విడదీశారు బంగాల్లోని కోల్కతా ఎన్ఆర్ఎస్ ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.
![NRS doctors perform rare surgery to separate conjoined babies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wb-kol-nrsconjoinedtwins-7211146_08072022212440_0807f_1657295680_563_0907newsroom_1657359704_9.jpg)
![NRS doctors perform rare surgery to separate conjoined babies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wb-kol-nrsconjoinedtwins-7211146_08072022212440_0807f_1657295680_838_0907newsroom_1657359704_804.jpg)
"దక్షిణ దినాజ్పుర్కు చెందిన ఓ భార్యభర్తలు తమకు పుట్టిన నవజాత అవిభక్త కవలలను తీసుకుని మా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే మేము వారిని అడ్మిట్ చేసుకుని.. వివిధ పరీక్షలను నిర్వహించాం. ఇద్దరు పిల్లల శరీరంలోని అవయవాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కాలేయాలు మాత్రం పొత్తి కడుపు ద్వారా కలిసి ఉన్నాయి. శస్త్రచికిత్స చేసి వేరు చేయాలని నిర్ణయించాం. ఈ శస్త్రచికిత్స సుమారు రెండు గంటల పాటు జరిగింది. మొత్తానికి అనుకున్నది సాధించాం"
-- నిరూప్ బిశ్వాస్, ఎన్ఆర్ఎస్ ఆసుపత్రి వైద్యుడు
ఇద్దరు నవజాత శిశువులు శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. "శుక్రవారం ఉదయం ఒక నవజాత శిశువుకు గుండెపోటు వచ్చింది. వెంటనే అత్యవసర చికిత్స అందించాం. ఇప్పుడు బాగానే ఉంది. మరో 5-6 రోజుల పాటు పరిశీలనలో ఉంచి పిల్లలను డిశ్చార్జ్ చేస్తాం. ప్రస్తుతం ఇద్దరు నవజాత శిశువులను వైద్యుల కమిటీ పర్యవేక్షిస్తుంది" అని డాక్టర్లు తెలిపారు.
ఇవీ చదవండి: ఎడతెరిపి లేని వాన.. కుప్పకూలిన 4 అంతస్తుల భవనం!
'నాకు ఇండియానే నచ్చింది'.. పోలీసులకు కృతజ్ఞతలు: బధిర యువతి గీత