ETV Bharat / bharat

ఫలించిన న్యాయవాది 21 ఏళ్ల పోరాటం.. రూ.20 కోసమే!​ - Consumer Commission Verdict

ప్రయాణికుడి నుంచి టికెట్​పై రూ.20 అదనంగా తీసుకున్నందుకు ఈశాన్య రైల్వే జోన్​కు రూ.15వేలు జరిమానా విధించింది వినియోగదారుల ఫోరం. 2001లో కమిషన్​ దృష్టికి ఈ కేసు వెళ్లగా.. 21 సంవత్సరాల తరువాత తీర్పు వెలువడింది.

Mathura District Consumer Commission
మథుర జిల్లా వినియోగదారుల పోరం
author img

By

Published : Dec 10, 2022, 8:44 PM IST

Updated : Dec 10, 2022, 8:52 PM IST

ఈశాన్య రైల్వే జోన్​కు రూ.15వేలు జరిమానా విధించింది జిల్లా వినియోగదారుల ఫోరం. ప్రయాణికుడి నుంచి టికెట్​పై రూ.20 అదనంగా తీసుకున్న కారణంగా ఈ తీర్పు వెల్లడించింది. 2001లో కమిషన్​ దృష్టికి ఈ కేసు వెళ్లగా .. 21 సంవత్సరాల పోరాటం తరువాత తీర్పు వెలువడింది.

వివరాళ్లోకి వెళితే.. ఉత్తర్​ప్రదేశ్​ మథురలోని హోలీ గేట్​కు చెందిన తుంగనాథ్ చతుర్వేది అనే న్యాయవాది 2001లో తన సహచరుడితో కలిసి మొరాదాబాద్ వెళ్లాల్సి వచ్చింది. అందుకు డిసెంబర్​ 25న ఈశాన్య రైల్వే జోన్​లో రెండు టికెట్లు తీసుకున్నాడు. ఒక్కో టికెట్​ ధర రూ.35. అయితే తుంగనాథ్ రూ.100 ఇచ్చాడు. టికెట్​ బుకింగ్​ క్లర్క్​ రెండు టికెట్లకు రూ.70కి బదులు, రూ.90 తీసుకున్నాడు. తుంగనాథ్​కు రూ.10 మాత్రమే తిరిగి ఇచ్చాడు. దీనిపై తుంగనాథ్ మథుర జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.​ తన వద్ద అదనంగా 20 తీసుకున్నారని పిటిషన్​ దాఖలు చేశాడు.

21 సంవత్సరాల పాటు ఈ కేసు సాగింది. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన తీర్పు వెల్లడించింది వినియోగదారుల ఫోరం. తుంగనాథ్​కు రూ.20 చెల్లించాలని ఈశాన్య రైల్వే జోన్​ను ఆదేశించింది. దానిపై సంవత్సరానికి 12 శాతం చొప్పున అదనంగా చెల్లించాలని పేర్కొంది. అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు మరో రూ.15వేలు చెల్లించాలని చెప్పింది. ఒక నెల లోపలే మొత్తం డబ్బును చెల్లించాలని ఆదేశించింది.

అయితే ఈ తీర్పుపై ఈశాన్య రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్ స్పందిచారు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు రైల్వేశాఖకు దరఖాస్తు చేసి.. ఛార్జీలు వాపసు తీసుకోవచ్చన్నారు. మథుర జిల్లా వినియోగదారులు ఫోరం తీర్పుపై రాష్ట్ర వినియోగదారుల కమిషన్​లో అప్పీల్​కు వెళ్లినట్లు ఆయన తెలిపారు. పిటిషన్​ను పరిశీలించిన రాష్ట్ర కమిషన్.. జిల్లా ఫోరం ఆదేశాలపై స్టే ఇచ్చిందని పంకజ్ కుమార్ సింగ్ వెల్లడించారు.

Last Updated : Dec 10, 2022, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.