ETV Bharat / bharat

ముఖ్యమంత్రికి కొత్త సమస్య- ఆ విషయంలో  తికమక

కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్​ బొమ్మైకి అధికారిక నివాసం విషయంలో సమస్య ఎదురైంది. 'కావేరీ' అధికారిక భవనంలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఉంటుండగా.. 'అనుగ్రహ' భవనంలో లోకాయుక్త జస్టిస్ విశ్వనాథ శెట్టి ఉంటున్నారు. దాంతో బొమ్మై.. తాను ఎక్కడ ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు.

author img

By

Published : Aug 14, 2021, 5:33 PM IST

Karnataka CM Bommai
కర్ణాటక సీఎం బొమ్మై

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మైకి అనూహ్య రీతిలో ఓ సమస్య ఎదురైంది. అయితే.. అది బాధ్యతల నిర్వహణలో కాదు. అధికారిక నివాసం విషయంలో. కొన్నేళ్లుగా కర్ణాటక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారికి ఓ భవనాన్ని ప్రత్యేకంగా కేటాయించకపోవడం వల్ల ఆయనకు ఈ సమస్య తలెత్తింది.

'కావేరీ', 'అనుగ్రహ' అనే రెండు అధికారిక నివాసాలు కర్ణాటక ముఖ్యమంత్రి నివాసం కోసం ఉన్నప్పటికీ... 'కావేరీ'లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసం ఉండగా.. 'అనుగ్రహ'లో లోకాయుక్త జస్టిస్​ విశ్వనాథ శెట్టి నివాసిస్తున్నారు. ఇక మిగిలిన మూడో నివాస భవనం- రేస్​ కోర్స్​. అయితే ఈ 'రేస్​ కోర్స్' భవనం చాలా చిన్నదిగా ఉన్నందున.. ముఖ్యమంత్రి కోసం వచ్చే ప్రజలకు ఇక్కడ ఇబ్బందిగా ఉండొచ్చు. దాంతో బొమ్మై.. ప్రస్తుతం తన అధికారిక నివాసాన్ని ఎక్కడ ఏర్పరుచుకోవాలో పాలుపోవట్లేదు.

'అనుగ్రహ' భవనం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నివాసం ఉండేందుకే అయినా.. కొన్ని మూఢ నమ్మాకాలు, ఇతర కారణాలతో.. కొన్నేళ్లుగా కర్ణాటక ముఖ్యమంత్రులు అక్కడ ఉండేందుకు విముఖత చూపుతున్నారు. దాంతో ఆ భవనంలో ఇతర అధికారులు నివసిస్తున్నారు.

'అనుగ్రహ'లో సమస్య ఏంటి?

'అనుగ్రహ'లో నివసించిన ముఖ్యమంత్రుల్లో ఎస్​ఎమ్​ కృష్ణ మినహా.. ఎవరూ తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన దాఖలాలు లేవు. హెచ్​డీ దేవేగౌడ(1994-96), ధరమ్​ సింగ్​(2004-05), హెచ్​డీ కుమారస్వామి(2006-07), డీవీ సదానంద గౌడ(2011-12) వంటి ముఖ్యమంత్రులు ఐదేళ్ల పాలన పూర్తి చేయలేదు. దాంతో మిగతా ముఖ్యమంత్రులు బీఎస్​ యడియూరప్ప, జగదీశ్​ శెట్టర్​, సిద్ధరామయ్య తమ నివాసాన్ని 'కావేరీ' లేదా 'రేస్​కోర్సు'లో నివసించేందుకే మొగ్గు చూపారు. గత నెలలో రాజీనామా చేసిన మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప.. చట్టం ప్రకారం మరో ఆర్నెల్లపాటు కావేరీలోనే ఉండనున్నారు.

ముఖ్యమంత్రులెవరూ.. 'అనుగ్రహ'లో ఉండేందుకు మొగ్గు చూపకపోవడం వల్ల దాంట్లో ప్రస్తుతం లోకాయుక్త జస్టిస్​ విశ్వనాథ్ శెట్టి ఉంటున్నారు.

సీఎస్​ నివాసంలోకి బొమ్మై!

బలాబ్రూయ్​ అతిథి గృహం, ఆర్ట్ గ్యాలరీ మధ్య ఉన్న ఓ ప్రభుత్వ నివాసాన్ని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం కేటాయించారు. ఆ భవంతిలో ప్రస్తుతం కర్ణాటక సీఎస్​ రవికుమార్ ఉంటున్నారు. 'అనుగ్రహ' కంటే ఇది కాస్త చిన్నదే అయినప్పటికీ.. ముఖ్యమంత్రి బొమ్మై తన నివాసాన్ని ఇక్కడకు మార్చేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

ఇదీ చూడండి: కోట్ల రూపాయల 'మోదీ సూట్' పరిస్థితి ఇదా?

ఇదీ చూడండి: బెదిరింపు సందేశాలు.. పోలీసుల హై అలర్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.