ETV Bharat / bharat

Nipah Virus Kerala : మళ్లీ 'నిపా' వైరస్​ కలకలం.. ఇద్దరు మృతి.. కేరళకు నిపుణుల బృందం - కేరళలో నిపా వైరస్ 2023

Nipah Virus Kerala : కేరళలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తులు నిపా వైరస్​ కారణంగానే చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. అందుకు సంబంధించిన వివరాలను ప్రకటించారు.

nipah-virus-kerala-unnatural-deaths-in-kozhikode-official-suspected-nipah
కేరళలో నిపా వైరస్‌ బాధితులు
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 8:34 AM IST

Updated : Sep 12, 2023, 9:09 PM IST

Nipah Virus Kerala : కేరళలో మళ్లీ నిఫా వైరస్‌ కలకలం రేగింది. కోజికోడ్​ జిల్లాలో ఇటీవల మృతి చెందిన ఇద్దరు.. ఈ వైరస్‌ బారిన పడే ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. ఈ క్రమంలోనే నిఫా వైరస్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడానికి, పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని కేరళకు పంపినట్లు వెల్లడించారు.

కొయ్‌కోడ్‌లో ఇటీవల రెండు అసహజ మరణాలు నమోదయ్యాయి. జ్వర సంబంధిత లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ.. ఆగస్టు 30న ఒకరు, సెప్టెంబరు 11న మరొకరు మృతి చెందారు. నిపా వైరస్‌ అనుమానంతో బాధితుల నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. తాజాగా వారు పాతోనే మృతి చెందినట్లు నిర్ధరణ అయ్యింది. మరోవైపు.. వారితో క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్నవారికి ఇప్పటికే చికిత్స అందిస్తున్నారు.

కేరళ ప్రభుత్వం ఇప్పటికే కోజికోడ్‌ జిల్లావ్యాప్తంగా అలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి జిల్లాకు చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. మంగళవారం స్థానికంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలంతా మాస్కు ధరించాలని సూచించారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న వారిలో ఎక్కువ మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నందున.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

2018 నుంచి 2021 వరకు కేరళలో అనేక నిపా వైరస్​ కేసులు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ భారత్​లో 2018 మే19 మొదటి నిపా వైరస్​ కేసు నమోదైంది. 2019 మరో నిపా కేసులు వెలుగులోకి వచ్చింది. 2021లోనూ మెదడవాపు వ్యాధితో చనిపోయిన బాలుడిలో నిపా వైరస్​ను గుర్తించారు వైద్యులు.

నిపా వైరస్​ వ్యాప్తి..
నిపా వైరస్‌ను 1989లో మలేషియాలో తొలిసారిగా గుర్తించారు. నిపా వైరస్‌ ఆతిథ్య జీవుల జాబితాలో.. పందులు, ఫ్రూట్‌ బ్యాట్‌ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్‌ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. అయితే వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు. వైరస్‌ ఉన్న గబ్బిలాలతో ప్రత్యక్ష లేదా పరోక్ష కాంటాక్ట్‌ ద్వారానే.. నిపా వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన గబ్బిలాల మూత్రం పండ్లు మీదకి చేరినప్పుడు.. ఆ పండ్లు, పళ్ల రసాల ద్వారా మనుషులకు వ్యాపించే ప్రమాదముందని పేర్కొంటున్నారు.

దీనికి ప్రత్యేకమైన టీకాలు, చికిత్స లేకపోవటం ఆ భయాలను మరింత పెంచుతున్నాయి. కొవిడ్‌తో పోలిస్తే నిపా వైరస్‌ అత్యంత ప్రమాదకరమైంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్‌ ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తితో.. సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకే నిపా వైరస్ సోకుతోంది. నిపా వైరస్‌లోని ప్రోటీన్లు మెదడు, కేంద్ర నాడీకణాల్లోనే కేంద్రీకృతమవుతాయి.

వైరాలజీ ఇన్‌స్టిట్యూట్​కు శాంపిళ్లు..
నిపా వైరస్​ కేసులో మొత్తం ఐదుగురి శాంపిళ్లను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. మృతుడు, అతడి నలుగురు బంధువుల శాంపిళ్లను పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించింది. ఘటనపై నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ తెలిపారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

మళ్లీ ప్రాణాంతక 'మెర్స్‌' వైరస్​ కలకలం.. 28 ఏళ్ల యువకుడిలో లక్షణాలు..

నిపా వైరస్... నిర్లక్ష్యంతోనే ముప్పు!

Last Updated : Sep 12, 2023, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.