ETV Bharat / bharat

ఐరన్ రాడ్డుతో స్టూడెంట్​ను కొట్టి చంపిన టీచర్.. ప్రశ్నించిన తల్లిపైనా...

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయుడు రాడ్డుతో కొట్టి చంపాడు. అదేంటని అడిగందుకు బాలుడి తల్లిపైనా దాడికి యత్నించాడు.

nine-year-old-boy-beaten-to-death
nine-year-old-boy-beaten-to-death
author img

By

Published : Dec 19, 2022, 10:38 PM IST

కర్ణాటక గడగ్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చేసిన దాడిలో నాలుగో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని తొమ్మిదేళ్ల భరత్ బారాకెరీగా గుర్తించారు.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడు ముత్తు హడాలీ ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. శనివారం.. స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో భరత్​ను ఐరన్ రాడ్డుతో కొట్టాడు ముత్తు. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వెళ్లాడు బాలుడు భరత్. జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పాడు. దీంతో భరత్ తల్లి గీత.. ఉపాధ్యాయుడిని నిలదీసేందుకు స్కూల్​కు వెళ్లింది. అప్పుడు ఆమెపైనా దాడికి యత్నించాడు ముత్తు.

తర్వాత, బాలుడిని హుబ్బళ్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. ఘటన అనంతరం నిందితుడు ముత్తు పరారయ్యాడు. మృతుడి తల్లి గీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కుర్చీ తాకాడని...
ఉత్తర్​ప్రదేశ్ మహోబా జిల్లాలో రెండో తరగతి విద్యార్థి పట్ల ప్రభుత్వ స్కూల్ టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. కుర్చీని తాకాడని తీవ్రంగా కొట్టాడు. బాలుడు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విద్యాధికారులు.. విచారణకు ఆదేశించారు. దోషిగా తేలితే ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఖరేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలువా గ్రామానికి చెందిన.. సురేశ్ సింగ్ శ్రీవాస్(7) స్థానిక ప్రైమరీ పాఠశాలలో చదువుతున్నాడు. గురువారం విద్యార్థులందరికీ ఐడీ కార్డులు జారీ చేశారు. కార్డులు పంపిణీ చేస్తుండగా.. టీచర్ కుర్చీని సురేశ్ తాకాడు. దీంతో కోపంతో బాలుడిని చావబాదాడు టీచర్. రెండు రోజుల పాటు తనకు ఈ విషయం చెప్పలేదని బాలుడి తల్లి అనితా దేవి పేర్కొన్నారు. శరీరంపై గాయాలు చూసి అడిగిన తర్వాతే విషయం చెప్పాడని తెలిపారు. అయితే, టీచర్ పొరపాటున కొట్టారా, వేరే కారణంతో కావాలనే కొట్టారా అనే విషయం తనకు తెలియదని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.