AGNEEPATH SCHEME: సాయుధ బలగాల నియామక ప్రక్రియ అగ్నిపథ్ పథకంలో ఎన్సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్ లెఫ్టెనెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ అన్నారు. ఎన్సీసీలో ఏ,బీ,సీ సర్టిఫికేట్ ఉన్నవారందరికి బోనస్ పాయింట్లు లభిస్తాయని వెల్లడించారు. గ్వాలియర్‌లో జరిగిన ఎన్సీసీ మహిళా ఆధికారుల స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎన్సీసీ అధికారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అకాడమీలో మూడు నెలల శిక్షణ తీసుకున్న 122 మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు అధికారులుగా వెళ్తున్నారు. మీరందరూ సాయుధ దళాల్లో యువకులు ఎక్కువ సంఖ్యలో చేరేలా కృషి చేయాలని గుర్బీర్పాల్ ఎన్సీసీ మహిళా అధికారులకు సూచించారు. 1950 నుంచి ఎన్సీసీలో మహిళా క్యాడెట్లు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
అగ్నిపథ్ ద్వారా త్రివిధ దళాల్లో చేరే వారిని అగ్నివీర్లుగా పిలుస్తారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. సాయుధ బలగాల్లో యువతను చేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఇవీ చదవండి: ద్రౌపది నామినేషన్.. సోనియా, మమతతో సంప్రదింపులు
'ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పవార్‌ను బెదిరిస్తారా?'