సరదా కోసం కుక్కలు, పిల్లులను పెంచుకోవడం సాధారణమైన విషయమే. అయితే కేరళలోని కన్నూర్‌కు చెందిన మహ్మద్ హీషాం అనే యువకుడు మాత్రం కొండచిలువలను పెంచుకుంటున్నాడు. వాటితో వ్యాపారం కూడా చేస్తున్నాడు. కేరళలో ఇప్పుడిప్పుడే పైథాన్‌లను పెంచుకునే వారి సంఖ్య పెరిగిపోతోందని అతను చెబుతున్నాడు. డిమాండ్‌ను బట్టి ఒక్కో పైథాన్ రూ.25 వేల నుంచి రూ.4 లక్షల వరకు అమ్ముతుంటానని మహ్మద్ హీషాం వివరించాడు.
కేరళ ప్రభుత్వం నుంచి ఇలాంటి సర్పాలను పెంచుకోటానికి.. అనుమతి లేకపోయినప్పటికీ, నిషేధం కూడా లేకపోవడం వల్ల వీటికి డిమాండ్ పెరుగుతోందని యువకుడు వివరించాడు. ఎవరికైనా ఈ విషరహిత సర్పాలు కావాలంటే పరివేశ్ అనే యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని.. తర్వాతే వాటిని తీసుకొస్తానని తెలిపాడు. ఆ పైథాన్‌లకు ఆహారం కోసం ఎలుకలను ప్రత్యేక బోనులలో పెంచుతున్నాడు. కొండచిలువలతో పాటు అరుదైన పక్షులను పెంచుతున్నట్లు హీషాం వివరించాడు.
ఇవీ చదవండి: పండగల వేళ బాంబుదాడులు.. హరిద్వార్, రిషికేశ్‌లకు 'జైషే మహ్మద్' బెదిరింపులు
పొదల్లో నగ్నంగా బాలిక మృతదేహం.. పిల్లలతో నదిలో దూకి వివాహిత ఆత్మహత్య