ETV Bharat / bharat

ఏడాది వయసు చిన్నారిని అపహరించి.. లైంగిక వేధింపులు - ఏడాది చిన్నారిపై లైంగిక వేధింపులు

తల్లి వద్ద నిద్రిస్తున్న ఏడాది వయసు చిన్నారిని అపహరించారు కొందరు కిరాతకులు. అనంతరం ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ పాశవిక ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

child sexually abused
ఏడాది చిన్నారిపై లైంగిక వేధింపులు
author img

By

Published : Nov 4, 2021, 4:45 AM IST

మధ్యప్రదేశ్​ ఇందోర్​లో అమానుష ఘటన వెలుగు చూసింది. అభంశుభం తెలియని ఏడాది వయసు చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు కిరాతకులు. తల్లి వద్ద నిద్రిస్తున్న సమయంలో చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు.

అసలేం జరిగింది?

ఇందోర్​ తీన్​ ఇమ్లీ ప్రాంతంలోని ఓ వంతెన కింద... సోమవారం రాత్రి ఓ చిన్నారి(1) తన తల్లి పక్కన నిద్రిస్తోంది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని అపహరించారు. ఘటనాస్థలి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజీవ్​గాంధీ స్క్వేర్​ ప్రాంతంలో మరుసటి రోజు ఆమెను దుండగులు వదిలిపెట్టారు. ఈ మేరకు ఆజాద్ నగర్​ పోలీస్​ స్టేషన్ ఇన్​ఛార్జ్​ ఇంద్రేశ్​ త్రిపాఠి తెలిపారు. లైంగిక వేధింపులకు గురైనట్లుగా చిన్నారి శరీరంపై గాయాలున్నాయని వైద్య నివేదికలో తేలిందని చెప్పారు.

నిందితులను పట్టుకునేందుకు ఘటనాస్థలిలోని సీసీటీవీ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

ఇవీ చూడండి:

ఆవుపై అత్యాచారం- నిందితుడికి గ్రామస్థులు దేహశుద్ధి

నాలుగేళ్ల చిన్నారిని సజీవ దహనం చేసిన కిరాతకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.