ETV Bharat / bharat

Mother Suicide with Childrens: విషాదం.. నీటి సంపులో దూకి.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య - విశాఖలో తల్లి ఆత్మహత్య

Mother Suicide With Childrens
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
author img

By

Published : Aug 9, 2023, 8:09 AM IST

Updated : Aug 9, 2023, 9:19 AM IST

07:59 August 09

అపార్టుమెంట్ నీటిసంపులో దూకిన తల్లి, ఇద్దరు పిల్లలు

Mother Suicide with Childrens Marripalem: నవమాసాలు కనిపెంచిన ఆ తల్లికి ఏమైందో ఏమో.. తాను లేకుండా తన పిల్లలు ఎలా బతుకుతారనే తల్లి ప్రేమే కావచ్చు.. తనతో పాటే పిల్లల్ని మృత్యు ఒడిలోకి తీసుకెళ్లెలా చేసింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఈ దారుణానికి పాల్పడింది. విగతా జీవులుగా తల్లితో పాటే చిన్నారుల మృతదేహలున్న ఘటన స్థానికులు చేత కంటతడి పెట్టించింది.

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మర్రిపాలెంలోని ప్రకాశ్​నగర్​లో సంధ్య దంపతులు నివాసముంటున్నారు. ఆమె భర్త వాచ్​మెన్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ దంపతులకు గౌతమ్‌ అనే 9సంవత్సరాల కుమారుడు.. అలేఖ్య అనే 5 సంవత్సరాల చిన్నారి ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గాని భార్య సంధ్య.. ఇద్దరు చిన్నారులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ అపార్ట్​మెంటులోని సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది.

Mother suicide with daughters ఇద్దరు కుమార్తెలతో చెరువులోకి దూకి తల్లి ఆత్మహత్య

దర్యాప్తు చేపట్టిన పోలీసులు: సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వారు వివరించారు. సంపులోంచి మృతదేహలను బయటకు తీసి కేజీహెచ్​కు తరలించారు.

Mother commits suicide with children : గాంధీనగర్‌లో విషాదం.. కట్నం వేేధింపులకు కవల పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

SUICIDE: పిడుగురాళ్లలో దారుణం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య

Last Updated : Aug 9, 2023, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.