సిలిండర్ పేలి తల్లితో సహా మూడేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన జమ్ముకశ్మీర్లో జరిగింది. పూంచ్ జిల్లాలోని చండీమార్హ్ గ్రామంలో ఈ విషాదం జరిగింది. చనిపోయిన మహిళను హమీదా బేగం(40)గా, బాలుడిని అకిబ్ అహ్మద్(4) పోలీసులు గుర్తించారు. ఒక చిన్నారి తీవ్రంగా గాయపడగా... ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి భర్త, మరో ఇద్దరు ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో 12 పైగా పశువులు మరణించాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్లు సూరన్కోటే డీఎస్పీ తన్వీర్ జిలానీ తెలిపారు.
![Mother Son charred cylinder explodes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17016423_297_17016423_1669267240268.png)
![Mother Son charred cylinder explodes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/jkc10031firecatchresidancehousetwodeadjkc10031vis3_24112022092935_2411f_1669262375_63_2411newsroom_1669269219_136.jpg)