ETV Bharat / bharat

ఓటమి ఎరుగని పెద్దాయన.. 92ఏళ్ల ఏజ్​లో రికార్డ్.. దటీజ్​ శివశంకరప్ప! - 92 Year Old shamanur shivashankarappa history

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత శామనూరు శివశంకరప్ప వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత వయోవృద్ధుడు ఆయనే. ఈ నేపథ్యంలో శివశంకరప్ప పొలిటికల్​ కెరీర్​ గురించి ఓ సారి తెలుసుకుందాం.

Most Senior Candidate shivshankarappa
Etv Most Senior Candidate shivshankarappaSenior Candidate shivshankarappa
author img

By

Published : May 13, 2023, 12:50 PM IST

Updated : May 14, 2023, 3:58 PM IST

Karnataka Elections Shivashankarappa : కర్ణాటక రాష్ట్ర ఎన్నికల చరిత్రలో అత్యంత వయోవృద్ధుడైన అభ్యర్థిగా నిలిచిన శామనూరు శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన శివశంకరప్ప.. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
శామనూరు శివశంకరప్ప.. దావణగెరె దక్షిణ నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నాయకుడు. ఇప్పుడు ఆయన వయసు 92 ఏళ్లు. ఈ వయసులో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఎంతో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి గెలుపొందారు.

Most Senior Candidate shivshankarappa
శివశంకరప్ప

శామనూరు శివశంకరప్ప రాజకీయ ప్రస్థానం ఇలా..

  • 1994- రాజకీయాల్లోకి అరంగేట్రం
  • 1994- దావణగెరె మునిసిపల్ కౌన్సిల్​ అధ్యక్షుడిగా ఎన్నిక
  • 1994- దావణగెరె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 1997- లోక్​సభ ఎన్నికల్లో గెలుపు
  • 1999- లోక్​సభ ఎన్నికలకు పోటీ చేసి ఓటమి
  • 2004- దావణగెరె ఎమ్మెల్యేగా మరోసారి గెలుపు
  • 2008, 2013, 2018 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు దావణగెరె దక్షిణ ఎమ్మెల్యేగా విజయం
  • 2023- అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం
    Most Senior Candidate shivshankarappa
    శివశంకరప్ప

దావణగెరె దక్షిణ నియోజకవర్గం శామనూరు శివశంకరప్ప వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008లో దావణగెరె నియోజకవర్గాన్ని దావణగెరె దక్షిణగా విడదీశారు. మొత్తంగా దావణగెరె నగరం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం విశేషం. ఇలా వరుస విజయాలతో దావణగెరె దక్షిణ ప్రజలపై మరోసారి విశ్వాసం వ్యక్తం చేసిన శివశంకరప్ప 'నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాపై ఉన్నాయి. నా వయసు 90 ఏళ్లు దాటినప్పటికీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఈసారి కూడా మళ్లీ నేనే గెలిచి చరిత్ర సృష్టిస్తా' అని ఇటీవలే తెలిపారు. చెప్పినట్లుగానే విజయం సాధించారు.
మరోవైపు శంకరప్పకు పోటీగా నిలబడ్డ బీజేపీ అభ్యర్థి బీజీ అజయ్‌కుమార్​కు ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లతో మంచి అనుబంధమే ఉంది. కానీ శివశంకరప్పకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో విజయకుమార్​ను బరిలోకి దింపిన కమలం పార్టీ వ్యూహం బెడిసికొట్టింది.

Most Senior Candidate shivshankarappa
నామినేషన్​ సమర్పిస్తున్న శివశంకరప్ప

లక్ష ఓట్ల తేడాతో డీకే శివకుమార్​ విజయం
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​.. కనకపురా నియోజకవర్గం నుంచి భారీ విజయం సాధించారు. జేడీఎస్​ అభ్యర్థి బి.నాగరాజుపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు.
కనకపురాలో శివకుమార్‌కు పోటీగా నామినేషన్ వేయాలన్నా ప్రత్యర్థులు రెండు మూడు సార్లు ఆలోచించాల్సిందే. 2008 వరకు కనకపురా అంటే జేడీఎస్‌కు కంచుకోట. ఇలాంటి ప్రాంతంలో కాంగ్రెస్‌ బలపడిందంటే అందుకు ప్రధాన కారణం డీకే కుటుంబమే. పంచాయతీ భవనాలు, విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ల వసతులతో ఈ ప్రాంతాన్ని డీకే సోదరులు అభివృద్ధి చేశారు. శివకుమార్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని చూసిన బీజేపీ.. అశోక్‌ను బరిలోకి దింపినా ఫలితం దక్కలేదు.

Most Senior Candidate shivshankarappa
సోదరుడితో డీకే శివకుమార్​

మాజీ సీఎంకు షాక్​.. నాలుగోసారి కృష్ణప్ప విజయం..
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ నాయకుడు జగదీశ్​ షెట్టర్​కు గట్టి షాక్​ తగిలింది. బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి మహేశ్​ చేతిలో 35 వేల ఓట్ల తేడాతో పరాజయం చెందారు. మరోవైపు, బీజేపీ సీనియర నేత ఎం.కృష్ణప్ప.. బెంగళూరు సౌత్​ నియోజకవర్గం నుంచి నాలుగోసారి గెలుపొందారు. కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి ఆర్​కే రమేశ్​పై 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Last Updated : May 14, 2023, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.