ఒడిశాలో ఓ వ్యక్తి మూగజీవాలకు విషం (Dog Poison) పెట్టి ప్రాణాలు తీశాడు. పన్నెండు వీధి కుక్కలను ఇలా చంపేశాడు. కటక్‌లోని శంకర్‌పుర్ ప్రాంతంలో (Cuttack Odisha) స్ట్రీట్ ఫుడ్ విక్రయించే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. జంతు హింస నిరోధక చట్టం (Prevention of Cruelty to Animals Act) కింద కేసు నమోదు చేశారు.
![More than a dozen stray dogs poisoned to death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13148301_vlcsnap-2021-09-23-15h17m41s799-3.jpg)
గత మూడు రోజుల నుంచి శునకాలు మృతి చెందుతున్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు. మరణించిన శునకాల దేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, కుక్కలకు విషం పెట్టి చంపడానికి గల కారణాలు తెలియలేదు.
![More than a dozen stray dogs poisoned to death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13148301_vlcsnap-2021-09-23-15h17m41s799-1.jpg)
శునకాల మృతదేహాలను శవపరీక్షల కోసం పంపించారు. మొత్తం పన్నెండు వీధి కుక్కలకు విషం పెట్టినట్లు నిర్ధరించారు అధికారులు. అయితే ఈ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని జంతు హక్కుల పరిరక్షణ ఫోరం చెబుతోంది. విషాహారం తిని అనారోగ్యంపాలైన వాటిని భువనేశ్వర్‌లోని ఆస్పత్రికి తరలించింది.
![More than a dozen stray dogs poisoned to death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13148301_vlcsnap-2021-09-23-15h17m41s545454545454.jpg)
ఇదీ చదవండి: తుపాకీతో బెదిరించి.. బాలికపై గ్యాంగ్‌రేప్