MODI UP VISIT: డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా రెట్టింపు వేగంతో పనులు జరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిజాయితీతో పనులు చేస్తే.. ప్రకృతి విపత్తులు కూడా ఆ పనులకు అడ్డంకి కావని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో నిర్మించిన ఎయిమ్స్, ఫర్టిలైజర్ ప్లాంట్‌ను ప్రారంభించారు ప్రధాని.
Modi opening Gorakhpur AIIMS:
"అణగారిన వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం ఉంటే.. కష్టపడి పనిచేయడమే కాకుండా ఫలితాలను సైతం సాధిస్తుంది. గోరఖ్‌పుర్‌లో ఫెర్టిలైజర్ ప్లాంట్, ఎయిమ్స్ ప్రారంభం అనేక సందేశాలను ఇస్తోంది. సంకల్పంతో ఉంటే నవ భారతంలో ఏదైనా అసాధ్యం కాదనే నిజాన్ని చాటి చెబుతోంది. కరోనా సమయంలోనూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. తన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించింది. గోరఖ్‌పుర్ ఫెర్టిలైజర్ ప్లాంట్.. రైతులకు, ఉపాధికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వాలు దీన్ని ప్రారంభించేందుకు యత్నించలేదు. గోరఖ్‌పుర్‌కు ఎయిమ్స్ కోసం ఎన్నో రోజుల నుంచి డిమాండ్ ఉంది. కానీ 2017కు ముందు ప్రభుత్వాలు స్థలం కేటాయించేందుకూ సాకులు వెతికాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కల సాకారం: యోగి
గోరఖ్‌పుర్‌కు వచ్చిన ఆయనకు.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన యోగి.. గత ముప్పై ఏళ్లలో ఐదు ప్రభుత్వాలు వచ్చి పోయాయని, భాజపా ప్రభుత్వం మాత్రమే ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రారంభించే ధైర్యం చేసిందని అన్నారు. ఇది యూపీ ప్రజల కల సాకారమైన రోజు అని చెప్పారు.
'1990లో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ మూతపడింది. 2014 వరకు దీని పునఃప్రారంభానికి ఎవరూ ప్రయత్నించలేదు. గోరఖ్‌పుర్ ప్రజలు 40 ఏళ్లుగా వైద్యసేవల కోసం పోరాడుతున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల లక్షల మంది చనిపోయారు. కానీ ఈరోజు యూపీ.. 17 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసి మైలురాయిని చేరుకుంది' అని అన్నారు యోగి.
Gorakhpur aiims:
రూ.1,011 కోట్ల వ్యయంతో గోరఖ్‌పుర్ ఎయిమ్స్ నిర్మాణం చేపట్టారు. 112 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 300 పడకలు ఉండగా.. జనవరి నాటికి 450 పడకలను అందుబాటులోకి తేనున్నారు. పూర్తిగా అందుబాటులోకి వస్తే ఆస్పత్రిలో 750 పడకలు ఉంటాయి. 14 మాడ్యూళ్లతో కూడిన ఆపరేషన్ థియేటర్లను ఎయిమ్స్‌లో నిర్మించారు. అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ వంటి వసతులు ఆస్పత్రిలో అందుబాటులో ఉండనున్నాయి.
ఇదీ చదవండి: 'పౌరులను కాల్చేసి.. మృతదేహాలను దాచే యత్నం'