ETV Bharat / bharat

'బైడెన్​ గెలిస్తే మోదీ సర్కార్​పై ప్రశ్నల వర్షమే!' - మోదీ మైనారిటీ హక్కులు

అధ్యక్ష పోరులో గెలుపొంది.. డెమొక్రాట్లు శ్వేతసౌధానికి చేరితే ప్రధాని మోదీ ప్రభుత్వంపై మైనారిటీల విషయంలో ప్రశ్నల వర్షం కురుస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ మీడియా సలహాదారు సంజర్​ బారు అభిప్రాయపడ్డారు. అయితే అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా.. వాణిజ్యం, భద్రతలో అమెరికా-భారత్​ బంధం మారదని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Modi govt will face questions over minority treatment if Biden takes White House: Sanjay Baru
'బైడెన్​ గెలిస్తే మోదీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షమే'
author img

By

Published : Nov 5, 2020, 3:07 PM IST

సంజయ్​ బారు ఇంటర్వ్యూ

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్​-జో బైడన్​లో ఎవరు ఎన్నికైనా.. వాణిజ్యం, భద్రతలో భారత్​తో అగ్రరాజ్యానికి ఉన్న బంధం మారదని మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ మీడియా సలహాదారు​ సంజయ్​ బారు పేర్కొన్నారు. ఒకవేళ డెమొక్రాట్లు శ్వేతసౌధానికి చేరితే మాత్రం.. భారత్​లోని మైనారిటీల హక్కులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురుస్తుందని ఈటీవీ-భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

"ట్రంప్​ గెలిస్తే అంతా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రధాని మోదీ, విదేశాంగశాఖ మంత్రి జై శంకర్​ ట్రంప్​తో బంధాన్ని బలపరుచుకునేందుకు చాలా సమయం కేటాయించారు. అయితే డెమొక్రాట్లు గెలిస్తే మాత్రం కష్టమే. భారత్​లో మోదీ ప్రభుత్వం పనితీరుపై వారు అసంతృప్తితో ఉన్నారు. మానవ హక్కులు, మైనారిటీలతో వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తారు. మనం వాటికి సమాధానమివ్వాల్సి ఉంటుంది."

-- సంజయ్​ బారు, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ మీడియా సలహాదారు​.

ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​తో పాటు అనేకమంది డెమొక్రాట్లు.. ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు సంజయ్​ బారు.

ఇదీ చూడండి:- 'యుద్ధ సామర్థ్యం ఉంటేనే శాంతి స్థాపన సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.