బిహార్ జముయీలో ఓ మైనర్‌ను అత్యంత దారుణంగా కొట్టిన ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సైకిల్ దొంగలించాడనే ఆరోపణతో చిన్న పిల్లాడని కూడా చూడకుండా... రెండు చేతులను వెనకకు కట్టేసి కొందరు బెల్ట్‌లతో కొట్టడం, కాలితో తన్నడం లాంటివి చేశారు. సైకిల్‌ను తాను దొంగలించలేదు అని బాలుడు చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా కొట్టి చిత్రహింసలు పెట్టారు. దీనిని స్థానికంగా ఉండే ఓ వ్యక్తి వీడియో తీశాడు. అది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది...
బోధవన్ తలాబ్ ప్రాంతంలోని జైశంకర్ నగర్ ప్రాంతానికి చెందిన గణేష్ సింగ్ అనే వ్యక్తికి చెందిన సైకిల్‌ను ఎవరో అపహరించారు. ఈ నేపథ్యంలో కేవలం అనుమానంతో ఆ బాలుడిని చితకబాదారు. చిన్న పిల్లాడు అనే జాలి లేకుండా చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు.
చిన్నారిని గుంపు కొట్టిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు ఎస్డీపీఓ డా. రాకేశ్ శర్మ తెలిపారు. ఈ ఘటన పై దర్యాప్తు జరుగుతోందని, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో ఉగ్రవాది హతం- జవాను వీరమరణం