ETV Bharat / bharat

'ఫారిన్' కోతుల దొంగలు అరెస్ట్​.. పక్కాగా స్కెచ్​ వేసి మరీ... - రెండు అరుదైన కోతులు చోరీ

Squirrel Monkeys: తమిళనాడు చెన్నైలోని ఓ జూ పార్క్​లో అపహరణకు గురైన అరుదైన కోతులను కాపాడారు అధికారులు. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. వారిలో ఒకరు జూ సిబ్బంది కూడా ఉన్నట్లు గుర్తించారు.

Squirrel Monkeys
Squirrel Monkey Stolen latest news
author img

By

Published : Feb 14, 2022, 10:50 AM IST

Updated : Feb 14, 2022, 12:13 PM IST

Squirrel Monkeys: తమిళనాడు చెన్నైలోని వాండలూర్​ అన్నా జూ పార్క్​లో అపహరణకు గురైన రెండు స్క్విరెల్​ జాతి కోతులను రక్షించారు అధికారులు. ఈ నేరానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో ఒకరు జూ తాత్కాలిక సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపారు.

ఈ ఘటనతో జూ పార్క్​లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. రాత్రి వేళ గస్తీని పెంచారు.

కంచె తెంచి..

ఇనుప కంచెకు రంద్రం చేసి కోతులను ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన అధికారులు ఫిబ్రవరి 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు.. ఆ సమయంలో జూలో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అతడికి ఓ జూ సిబ్బంది సహకరించినట్లు గుర్తించారు.

ఈ కోతులకు భారీ డిమాండ్​..

ఈ రెండు మగ స్క్విరెల్​ కోతులను 2018లో చెన్నై విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన స్మగ్లర్​ల నుంచి వీటిని స్వాధీనం చేసుకుని జూపార్క్​కు తరలించారు. ఈ అరుదైన కోతులకు ప్రపంచ మార్కెట్​లో భారీ డిమాండ్​ ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'సైకో' ఉడత బీభత్సం.. ఊరంతా భయంభయం.. చివరకు మరణ శిక్ష!

Last Updated : Feb 14, 2022, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.