Minor Saves Mother: ప్రాణాపాయంలో ఉన్న తల్లిని చాకచక్యంగా రక్షించాడు 11 ఏళ్ల బాలుడు. శరీరం విషపూరితమై ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్న ఆమె గురించి ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. బాలుడి సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన హరియాణాలోని ధనీమహ్తాబ్ గ్రామంలో జరిగింది.
ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితురాలిని ఆ గ్రామానికి చెందిన సోమాదేవీగా పోలీసులు గుర్తించారు. ఆమెపై విషప్రయోగం జరిగిందా లేక ఆమె ఆత్మహత్యకు యత్నించిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఇదీ చూడండి : టీ ఇచ్చి టిఫిన్ పెట్టలేదని.. కోడలిపై కాల్పులు