రాజస్థాన్లో దారుణం జరిగింది. 20 ఏళ్లు యువకుడు ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంకా ఆ సమయంలో జరిగింది అంతా ఫోన్లో చిత్రీకరించి.. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఈ వీడియో రాజస్థాన్లోని జలోర్ జిల్లావ్యాప్తంగా చక్కర్లు కొట్టినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు మన్సూర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తొలుత నిందితుడు బాలికతో స్నేహితుడిలా మెలిగి.. నమ్మకం కలిగించి ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడని అధికారులు చెప్పుకొచ్చారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దళిత మహిళపై గ్యాంగ్ రేప్.. భర్త ఎదురుగానే...