ETV Bharat / bharat

స్నేహితుడితో గుడికి వెళ్లిన మైనర్​​పై గ్యాంగ్​ రేప్​.. ప్రియురాల్ని హత్యచేసి పెరట్లోనే.. - నైగర్హి పోలీస్ స్టేషన్

ఇద్దరు మైనర్లు సహా.. ఆరుగురు వ్యక్తులు కలిసి 16 ఏళ్ల బాలిక​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. నిందితుల్లో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళను హతమార్చి.. మృతదేహాన్ని ఇంటి పెరట్లోనే పాతిపెట్టిన దారుణం ఛత్తీస్​గఢ్​లో వెలుగుచూసింది.

minor girl gang rape
అత్యాచారం
author img

By

Published : Sep 19, 2022, 10:58 AM IST

మధ్యప్రదేశ్ రీవాలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్లు సహా మొత్తం ఆరుగురు కామాంధులు 16 ఏళ్ల బాలిక​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రీవా జిల్లా ప్రధాన కార్యాలయానికి 70 కిలోమీటర్ల దూరంలోని నైగర్హి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిందీ ఘటన. మరోవైపు ముగ్గురు నిందితుల అక్రమ భవన నిర్మాణాల్ని కూల్చివేసింది జిల్లా యంత్రాంగం. నేరంలో పాల్గొన్న మరో ముగ్గురు విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

బాధితురాలు తన స్నేహితుడితో కలిసి శనివారం మధ్యాహ్నం ఆలయానికి వెళ్లింది. అయితే ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో నలుగురు వ్యక్తులు సహా ఇద్దరు మైనర్లు అక్కడికి వచ్చారు. బాలిక​ స్నేహితుడిపై దాడి చేసి ఆమెను సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు వదిలిపెట్టమని వేడుకున్నా నిందితులు కనికరించలేదు. బాలికపై అత్యాచారం అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టి మొబైల్​ సహా విలువైన సామగ్రి పట్టుకుని పరారయ్యారు. అనంతరం బాలికను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.

హత్యచేసి ఇంటి పెరట్లో..: ఛత్తీస్​గఢ్ రాయగఢ్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ప్రియురాలిని హత్య చేసి తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాధితుడి ఇంటి పెరట్లో పాతిపెట్టిన శవాన్ని వెలికితీశారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అసలేం జరిగిందంటే.. నిందితుడు ఖగేశ్వర్‌, బాధితురాలు కాంతి యాదవ్‌లు కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికీ అంతకుముందే వేర్వేరుగా పెళ్లిలు జరిగాయి. కానీ ఇద్దరూ తమ కుటుంబాల్ని విడిచిపెట్టి సహజీవనం సాగిస్తున్నారు. కాంతికి ఇద్దరు కుమారులు కాగా.. ఖగేశ్వర్‌కు నలుగురు పిల్లలు. ఖగేశ్వర్.. భార్య, పిల్లల్ని జశ్​పుర్​లో విడిచిపెట్టి వచ్చి.. 2018 నుంచి కాంతితో కలిసి జీవిస్తున్నాడు.

బాధితురాలి ఫోన్ 17 రోజులుగా స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో ఆమె ప్రియుడు ఖగేశ్వర్​పై బాధితురాలి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కంకూరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖగేశ్వర్​ను.. బాధితురాలి తండ్రి తన కుమార్తె గురించి ప్రశ్నించాడు. అతడు దురుసుగా సమాధానం చెప్పేసరికి బాధితురాలి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఈ విషయం బాధితురాలి అక్కకు తెలిసింది. దీంతో ఆమె నిందితుడి ఇంటికి వెళ్లేసరికి అసలు విషయం బయటపడింది.

మొండెం లేని మృతదేహం..
మహారాష్ట్రలో గతేడాది సంచలనం సృష్టించిన ఓ కేసును వాసాయ్ పోలీసులు ఛేదించారు. గతేడాది భుయిగావ్​ బీచ్​లో మొండెంలేని మృతదేహం సూట్​కేస్​లో లభ్యమైంది. అయితే తల లేక పోవడం వల్ల ఆ మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించలేకపోయారు. తాజాగా ఈ కేసును ఛేదించారు. మొండెంలేని మృతదేహం నలసోపారాకు చెందిన 25 ఏళ్ల సానియా షేక్‌గా గుర్తించారు. ఈ హత్య కేసులో ఆమె భర్త అసిఫ్​ను అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది.. గతేడాది జులై 26న భుయిగావ్ బీచ్‌లో మొండెంలేని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తల లేకపోవడం వల్ల మృతదేహం ఎవరిదో గుర్తించలేకపోయారు. పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో తప్పిపోయిన మహిళల రికార్డులను కూడా తనిఖీ చేశారు. ఇంతలో ఈ ఏడాది ఆగస్టు 29న సానియా షేక్ (25) అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు అచోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహానికి డీఎన్‌ఏ పరీక్షలు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోనియా భర్త ఆసిఫ్ షేక్‌ను అరెస్టు చేశారు.

బెల్గాంకు చెందిన సానియాకు నాలాసోపారాలో నివసించే ఆసిఫ్ షేక్‌తో వివాహమైంది. భార్యపై అనుమానంతో సానియాను అసిఫ్ హత్య చేశాడు. అనంతరం సూట్​కేసులో పెట్టి బీచ్​లో పడేశాడు. సానియా పేరుతో ఆమె భర్త నకిలీ లేఖ రాసిపెట్టాడు.

--పోలీసులు

ఇవీ చదవండి: కళ్లు ఆర్పిన హనుమంతుడు.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం!

ఆటో డ్రైవర్ జాక్​పాట్.. టికెట్ కొన్న ఒక్కరోజుకే రూ.25 కోట్లు.. విదేశాలకు వెళ్లే ముందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.