ETV Bharat / bharat

ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం.. కలుద్దాం రమ్మని.. స్నేహితులతో కలిసి.. - రాజస్థాన్​లో మైనర్​పై అత్యాచారం​

13 ఏళ్ల బాలిక గర్భవతి అయిన ఘటన రాజస్థాన్​లో జరిగింది. బాధితురాలిపై నాలుగు నెలల క్రితమే సామూహిక అత్యాచారం జరగడం వల్ల గర్భం దాల్చిందని పోలీసులు తెలిపారు.

jaipur minor rape
మైనర్​పై సామూహిక అత్యాచారం
author img

By

Published : Jun 27, 2022, 7:25 PM IST

రాజస్థాన్​లోని జైపుర్​లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలిక​ గర్భవతి అయింది. బాధితురాలిపై నాలుగు నెలల క్రితం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధులు. అందువల్లే మైనర్​ గర్భం దాల్చిందని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే: బాధితురాలికి కొన్ని నెలల క్రితం నిందితుడు ఇన్​స్టాగ్రామ్​ ద్వారా పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అనంతరం ఓ రోజు ఫోన్​ చేసి కలుద్దామని అన్నాడు. కలవడానికి వచ్చిన బాలికపై మరో ఇద్దరు స్నేహితులతో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాదు. ఇటీవల బాలిక కడుపు నొప్పితో బాధ పడడం వల్ల ఆమె తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి బాధితురాలు గర్భవతి అని తేల్చారు. బాధితురాలి తల్లి ముగ్గరు నిందితులపై భాంక్రోటా పోలీస్​ స్టేషన్​లో ఆదివారం ఫిర్యాదు చేసింది.

"నాలుగు నెలల క్రితం బాలికపై అత్యాచారం జరిగింది. బాధితురాలి కుటుంబం బంగాల్​కు చెందినది. వారు చాలా కాలంగా జైపుర్​లో స్థిరపడ్డారు. బాలికకు వైద్య పరీక్షలు చేయిస్తాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. హేమంత్ రాఠోడ్, రోహన్ మీనా, హరీశ్ గుప్తాను నిందితులుగా గుర్తించాం"

- పోలీసులు

ఇవీ చదవండి: 'నిత్యానంద ఆశ్రమం నుంచి నా కూతుర్ని రక్షించండి'.. తండ్రి ఆవేదన

క్షుద్రపూజలతో మహిళ హత్య.. పేగులు తీసి.. ముక్కలుగా నరికి దహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.