ETV Bharat / bharat

బ్యాంక్​ను దోచుకున్న బాలుడు.. క్షణాల్లో రూ.35 లక్షలు మాయం - Minor Boy Bank Theft

Minor Boy Bank Theft: పంజాబ్​ పటియాలాలోని స్టేట్ బ్యాంక్​ నుంచి రూ.35 లక్షలు కాజేశాడు ఓ బాలుడు. ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన డబ్బుతో కూడిన బ్యాగును పట్టుకుని క్షణాల్లో మాయమయ్యాడు. సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

boy vanish with Rs 35 lakh cash bag from SBI branch in Patiala

author img

By

Published : Aug 3, 2022, 7:37 PM IST

క్షణాల్లో బ్యాంక్​ను దోచేసిన బాలుడు

Minor Boy Bank Theft: పంజాబ్​ పటియాలాలో షాకింగ్​ ఘటన జరిగింది. షెరాన్​వాలా గేట్​ ప్రాంతంలోని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా నుంచి రూ. 35 లక్షలు కాజేశాడు ఓ బాలుడు. సీసీటీవీల్లో సంబంధిత దృశ్యాలు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా.. బాలుడిని వెతికి పనిలో పడ్డారు పోలీసులు.

25 ఏళ్ల ఓ యువకుడితో బాలుడు బ్యాంకులోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. 25 నిమిషాల పాటు రెక్కీ నిర్వహించి.. ఎవరి కంటా పడకుండా డబ్బు దోచుకెళ్లారని వివరించారు. ఏటీఎంలో డిపాజిట్​ చేయాల్సిన డబ్బును.. బ్యాంకు అధికారి క్యాష్​ కౌంటర్​ బయట ఉంచిన సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: ప్రేమించడం లేదని యువతి కిడ్నాప్.. పాతకక్షలతో నడిరోడ్డుపై హత్య

'గాంధీ'లకు ఈడీ బిగ్ షాక్.. ఆ ఆఫీస్​ సీజ్​.. సోనియా ఇంటి వద్ద భారీగా పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.