ఆ యువకుడు చదివింది పదో తరగతే. అది కూడా ఫెయిల్ అయ్యాడు. అయితేనేం తన ప్రతిభతో ఓ బైక్‌ను తయారు చేశాడు. ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించి అందరి మన్ననలు పొందుతున్నాడు. అతడే మహారాష్ట్రకు చెందిన సోహైల్ ఫతే మహ్మద్.
వివరాల్లోకి వెళితే.. సోహైల్ ఫతే మహ్మద్.. నాగ్‌పుర్‌కు చెందిన యువకుడు. పనికిరాని వస్తువులను, వ్యర్థాలను ఉపయోగించి ఓ బైక్ తయారు చేశాడు. ఇందుకు కేవలం రూ.10 వేలను మాత్రమే ఖర్చు చేశాడు. 125 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ఈ బైక్ రూపొందించాడు. ఔరంగాబాద్‌లోని ఆమ్ ఖాస్ మైదానంలో జరిగిన బిజినెస్ ఎక్స్‌పోలో.. సోహైల్ తన బైక్‌ను ప్రదర్శించాడు. బైక్‌లు అమ్మడం తన లక్ష్యం కాదని.. మంచి పెట్టుబడిదారు దొరికితే.. తన కలను సాకారం చేసుకుంటానని సోహైల్ చెబుతున్నాడు. తన తల్లి ప్రోత్సాహంతోనే ఇలా పనికిరాని వస్తువులతో బైక్‌ను తయారు చేసినట్లు అతడు వివరించాడు.