ETV Bharat / bharat

ఒకే దేశం-ఒకే యూనిఫాం.. 'ఖాకీ' వస్త్రం ఎక్కడ పుట్టిందో తెలుసా? - ఖాకీ యూనిఫాం ధరిస్తున్న ఉద్యోగులు

పోలీసులు, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, వివిధ రంగాల కార్మికులు ఇలా చాలా మంది యూనిఫాంగా ఖాకీ రంగు వస్త్రాలే ఉంటాయి. అయితే ఖాకీ రంగు వస్త్రాలను మొదటిసారిగా ఎక్కడ తయారుచేశారో, తొలుత ఎవరు ఉపయోగించారో తెలుసా?

khaki uniform mangalore
ఖాకీ యూనిఫాంతో కర్ణాటక పోలీసులు
author img

By

Published : Nov 15, 2022, 5:07 PM IST

Updated : Nov 15, 2022, 7:06 PM IST

ఒకే దేశం-ఒకే యూనిఫాం.. 'ఖాకీ' వస్త్రం ఎక్కడ పుట్టిందో తెలుసా?

పోలీసులు అనగానే అందరికి గుర్తొచ్చేది ఖాకీ రంగు యూనిఫాం. అలాగే రవాణా శాఖ ఉద్యోగులు, వివిధ పరిశ్రమల కార్మికులు కూడా ఖాకీ రంగు దుస్తుల్నే యూనిఫాంగా ఉపయోగిస్తారు. ఖాకీ రంగు దుస్తుల్ని మొదట ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరో, తొలుత ఎక్కడ తయ్యారు చేశారో ఓ సారి తెలుసుకుందాం.

ప్రస్తుతం ఖాకీ రంగు దుస్తులను భారత్​లోనే కాకుండా ప్రపంచంలోని పలు రంగాల ఉద్యోగులు యూనిఫాంగా ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోలీసులందరికీ ఒకే యూనిఫాం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వ్యాఖ్యానించడం వల్ల.. ఖాకీ యూనిఫాం చర్చనీయాంశమైంది. ఖాకీ దుస్తుల్ని.. మొట్టమొదటసారిగా కర్ణాటక మంగళూరులోని బల్మఠలోని ఓ ఖాదీ కర్మాగారంలో తయారుచేశారు. ఖాకీ రంగు వస్త్రాలపై పీహెచ్​డీ చేసిన పుత్తూరులోని వివేకానంద కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ పీటర్ విల్సర్​ ప్రభాకర్ ఈ విషయం చెప్పారు. దేశవ్యాప్తంగా పోలీసులందరికీ ఒకే యూనిఫాం పెట్టాలనుకుంటే ఖాకీ రంగునే ఉపయోగించాలని కోరారు.

khaki uniform mangalore
ఖాకీ యూనిఫాంతో కర్ణాటక పోలీసులు

"ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఖాకీ యూనిఫాంను మంగళూరులో తయారు చేశారు. బాషెల్ అనే మిషనరీ సంస్థ.. 1844వ సంవత్సరంలో మంగళూరులోని బల్మఠలో ఖాదీ కర్మాగారాన్ని స్థాపించింది. 1852లో జర్మనీకి చెందిన జాన్ ఎల్లెర్ తన పరిశోధనల ద్వారా ఖాకీ రంగు వస్త్రాన్ని తయారుచేశారు. జీడిపప్పు తొక్క, బెరడుతో తయారు చేసిన రసాన్ని ఖాదీపై చల్లడం ద్వారా ఖాకీ రంగు వస్త్రాన్ని రూపొందించారు."

--పీటర్ విల్సన్ ప్రభాకర్​, రిటైర్డ్ ప్రిన్సిపల్

1860లో మొట్టమొదట కెనరా జిల్లాలో ఖాకీ వస్త్రాన్ని పోలీసుల యూనిఫాంగా ఉపయోగించారు. అప్పటి మద్రాసు ప్రావిన్స్ గవర్నర్ లార్డ్ రాబర్ట్ మంగళూరులోని ఖాదీ కర్మాగారాన్ని సందర్శించినప్పుడు.. ఖాకీ రంగు వస్త్రాన్ని చూసి ముగ్ధుడయ్యారు. మద్రాసు వెళ్లిన వెంటనే అక్కడ ప్రావిన్స్‌లోని బ్రిటిష్ సైనికులు.. ఖాకీ రంగు యూనిఫాం ధరించేందుకు అనుమతించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. లార్డ్ రాబర్ట్​ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది. అప్పటి నుంచి బ్రిటిష్ సైనికులు ఖాకీ రంగు యూనిఫాంను ధరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత లార్డ్ రాబర్ట్.. ఖాకీ రంగు దుస్తుల్ని ప్రపంచంలోని బ్రిటిష్ సైనికులందరికీ యూనిఫారంగా మార్చాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇందుకు కూడా అంగీకరించింది. దీంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని బ్రిటిష్ సైనికులు ఖాకీ యూనిఫాం ధరించడం మొదలుపెట్టారు.

khaki uniform mangalore
పోలీసులు

ఇవీ చదవండి: గోధుమ వర్ణ కశ్మీర్​లో ప్రీ వెడ్డింగ్​ షూట్​ సందడి.. ఇప్పటికే 1.62 కోట్ల పర్యటకుల రాక

స్వీటీ వెడ్స్ షేరు.. అంగరంగా వైభవంగా కుక్కల పెళ్లి

Last Updated : Nov 15, 2022, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.