ETV Bharat / bharat

షోరూం టాయిలెట్​లో దాక్కొని.. గర్ల్​ఫ్రెండ్ కోసం సెల్​ఫోన్ చోరీ - Man hides in washroom of showroom overnight and stolen mobile phone

ప్రియురాలి కోసం సెల్​ఫోన్ షోరూంలో ఖరీదైన ఫోన్లు కొట్టేశాడు ఓ వ్యక్తి. షోరూం మూసేంతవరకు టాయిలెట్​లో దాక్కొని.. అనంతరం దొంగతనం చేశాడు.

Man stolen expensive mobile phones for his girlfriend at bengaluru

author img

By

Published : Jul 30, 2022, 9:48 PM IST

Updated : Jul 31, 2022, 10:56 AM IST

ప్రియురాలికి సెల్‌ఫోన్‌ కానుకగా ఇచ్చేందుకు కర్ణాటకు చెందిన ఓ యువకుడు ఏకంగా సెల్‌ఫోన్‌ దుకాణానికి కన్నంవేశాడు. సీసీ దృశ్యాల ఆధారంగా పోలీసులు అరెస్ట్‌ చేయగా ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. బెంగళూరుకు చెందిన అబ్దుల్‌ మునాఫ్‌ ఈనెల 20న రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో క్రోమ్‌ షోరూంకు వెళ్లాడు. షోరూం మూసే సమయంలో మహిళా టాయ్‌లెట్‌లోకి వెళ్లిపోయాడు. అక్కడే దాక్కున్న అతడు... షోరూం మూసిన తర్వాత ఖరీదైన 6సెల్‌ఫోన్లను తస్కరించాడు. ఆ తర్వాత గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి తప్పించుకున్నాడు.

మరుసటిరోజు షోరూంకు వచ్చిన సిబ్బంది సెల్‌ఫోన్లు చోరీ అయిన విషయాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి 5 లక్షల విలువ చేసే ఖరీదైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటరాగేషన్‌లో ప్రియురాలి కోసం సెల్‌ఫోన్లు చోరీ చేసినట్లు చెప్పాడు. దీంతో అవాక్కవడం పోలీసుల వంతైంది.

Man stolen expensive mobile phones for his girlfriend at bengaluru
నిందితుడు

ఇదీ చదవండి:

Last Updated : Jul 31, 2022, 10:56 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.