COVID vaccine death: మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా టీకా దుష్ప్రభావాల కారణంగా తన కుమార్తె చనిపోయిందని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. మహారాష్ట్ర ప్రభుత్వం, సీరం సంస్థలను రూ.1000కోట్లు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని పటిషన్లో కోరాడు. వైద్య విద్యార్థిని అయిన తన కూతురు గతేడాది జనవరిలో వ్యాక్సిన్ తీసుకుందని, ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిందని వివరించాడు.
" నా కూతురు స్నేహాల్.. నాశిక్‌లో వైద్య విద్యార్థిని. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆరోగ్య కార్యకర్తలంతా టీకా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పినందున ఆమె గతేడాది కొవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకుంది. కరోనా టీకా సురక్షితమని, ఎలాంటి హాని ఉండదని చెప్పారు. అది నమ్మి వైద్య కళాశాలలో నా కూతురు వ్యాక్సిన్ తీసుకుంది. ఆమె ఆరోగ్య కార్యకర్తగా కూడా సేవలందించింది. టీకా సురక్షితమని డీజీసీఐ, ఎయిమ్స్, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెప్పడం వల్ల నా కూతురు లాంటి ఆరోగ్య కార్యకర్తలు ఎంతో మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. కొవిషీల్డ్ టీకా దుష్ప్రభావాల కారణంగానే నా కుమార్తె మృతి చెందిందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన AEFI కమిటీ గతేడాది అక్టోబర్ 2న చెప్పింది. నా కుతురుకి న్యాయం చేయాలని, అలాగే ఆమె లాంటి ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకే ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నా.
-దిలీప్ లునావత్, పిటిషనర్.
తన కూతురు 2021 జనవరి 28న టీకా తీసుకుందని, ఆ తర్వాత దుష్ప్రభావాల కారణంగా మార్చి 1న మరణించిందని లునావత్ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే దీన్ని గతవారమే దాఖలు చేయగా.. హైకోర్టు విచారణకు ఇంకా తేదీని ఖరారు చేయలేదు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. ఒక్క రోజే 1,733 మరణాలు