మహారాష్ట్ర వార్ధా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి కారు కిందపడిన ఘటనలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. యావత్మాల్- వార్ధా రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మృతుల్లో గోండియా జిల్లా తిరోడా ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ కుమారుడు ఆవిష్కార్ రహంగ్‌డేల్ కూడా ఉన్నారు.
సెల్సురా గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జ్ దగ్గరకు రాగానే కారు అదుపుతప్పి 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులోని అందరూ మృతి చెందారు. సావంగిలోని వైద్య కళాశాలలో విద్యార్థులు చదువుతున్నట్లు సమాచారం.