దేశంలో పెట్రో, డీజిల్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ఇదే తరహాలో తమిళనాడు మధురైకి చెందిన ధనుష్ అనే విద్యార్థి రూపొందించిన సోలార్ సైకిల్‌కు.. ప్రస్తుతం విశేష స్పందన లభిస్తోంది.
ఈ ఎలక్ట్రిక్ సైకిల్.. పర్యావరణ హితమైనదే కాక ఇంధనాలపై అయ్యే ఖర్చుల భారాన్ని కూడా తగ్గిస్తుంది. సైకిల్‌కు అమర్చిన బ్యాటరీకి సోలార్ ప్యానెల్స్‌ను కనెక్ట్ చేశాడు ధనుష్. సౌర శక్తి సాయంతో నడితే ఈ సైకిల్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఈ సైకిల్‌పైన 30-40కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 వరకు ప్రయాణించగలదు. బ్యాటరీ దిగిపోయినా 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చన్నాడు ధనుష్. దీనిపై కిలోమీటరు ప్రయాణానికి అయ్యే ఖర్చు రూ1.50 మాత్రమే. దీనిని బైక్గానూ, సైకిల్గాను కూడా ఉపయోగించుకోవచ్చు.
కంప్యూటర్ సైన్సులో డిగ్రీ పూర్తి చేసిన ధనుష్.. చిన్నప్పటి నుంచి నవకల్పన అంటే ఆసక్తి అని తెలిపాడు. ఈ క్రమంలోనే ఈ సైకిల్‌ను రూపొందించినట్లు పేర్కొన్నాడు.
ఈ సైకిల్‌ను ధనుష్ కొద్ది నెలల క్రితమే తయారు చేసినా.. ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో దీనికి ఆదరణ పెరుగుతోంది.
ఇదీ చదవండి : ప్రాంతీయ భాషల్లో బోధనతోనే నాణ్యమైన విద్య