ETV Bharat / bharat

'ఎవరినీ వదిలిపెట్టను.. దిల్లీ పీఠం కదిలిస్తా!'.. కేంద్రానికి లాలూ కుమార్తె వార్నింగ్

జాబ్ స్కామ్​ కేసులో ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ను సీబీఐ ప్రశ్నించడంపై ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రంగా స్పందించారు. ఆయనకు ఏమైనా జరిగితే ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. ఆర్​జేడీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది.

lalu-prasad-yadav-daughter-warns-central-govt
కేంద్రానికి లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు హెచ్చరిక
author img

By

Published : Mar 7, 2023, 6:21 PM IST

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్​ ఇచ్చారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్​జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్​ యాదవ్​ కుమార్తె రోహిణి ఆచార్య. తాను ఎవరినీ వదిలి పెట్టనని ఎన్​డీఏ సర్కార్​ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు లాలూ సహా ఆయన కుటుంబసభ్యుల్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో రోహిణి ఇలా స్పందించారు. తన తండ్రి.. బిహార్​ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలుూ ప్రసాద్​ యాదవ్​ను​ కేంద్రం వేధిస్తోందని ఆరోపించారు.

"నా తండ్రిపై నిరంతరం వేధింపులు జరుగుతున్నాయి. ఆయనకు ఏమైనా జరిగితే.. నేను ఎవరినీ వదిలిపెట్టను. ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరైందికాదు. ఇవన్నీ నాకు గుర్తుంటాయి. కాలం శక్తిమంతమైనది. దానికి చాలా బలముంది. ఇది గుర్తుంచుకోవాలి." అని మంగళవారం రోహిణి ఆచార్య ట్వీట్ చేశారు. ఇక భరించే కాలం దాటిపోయిందన్న ఆమె.. ఈ కక్షసాధింపు చర్యల కారణంగా తమ తండ్రికి ఏదైనా జరిగితే.. దిల్లీ పీఠాన్ని కదిలిస్తానని మరో ట్వీట్‌ చేశారు.

ఘాటుగా బదులిచ్చిన బీజేపీ..
సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో ఆర్​జేడీపై.. బీజేపీ విరుచుకుపడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్​ యాదవ్​ను సీబీఐ ఎందుకు ప్రశ్నించకూడదని ప్రశ్నించింది. లాలూ చేసిన కుంభకోణాలపై సమాధానం లేని కారణంగానే 2017లో.. నితీశ్ కుమార్ ఆయనను విడిచిపెట్టారని సీనీయర్​ బీజేపీ నాయకులు రవిశంకర్​ ప్రసాద్​ విమర్శించారు. లాలూపై అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పండని బిహార్​లోని అధికార పార్టీలైన జేడీయూ, ఆర్​జేడీని ప్రశ్నించారు. ఈ రోజు ఆ స్కామ్​లపై చార్జ్​షీట్​ నమోదై, విచారణ సైతం జరుగుతోందన్న రవిశంకర్​.. దీనిపై పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదన్నారు.

"కాంగ్రెస్​ హయాంలోనే ఈ కుంభకోణంపై కోర్టులో పలు పిల్​లు ​దాఖలయ్యాయి. బీజేపీ నాయకులు సుశీల్​ కుమార్ మోదీ, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్​ సింగ్​ ఈ పిల్​లు దాఖలు చేశారు. ఇందుకు నితీశ్​ కూడా మద్దతు ఇచ్చారు. లాలూ ప్రసాద్​ యాదవ్​ నాలుగు కుంభకోణాల్లో నిందితుడు. ఆయనపై మరిన్ని కేసులు అప్పీలులో ఉన్నాయి. జేడీయూ, ఆర్​జేడీ మాత్రం.. బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని అంటున్నాయి." అని రవిశంకర్​ అన్నారు. నితీశ్​​ కుమార్​ తనకు తాను బిహార్​ 'సుశాసన్ బాబు'గా పిలుచుకోవడం మానుకోవాలన్నారు రవిశంకర్​. బిహార్ రాష్ట్రాన్ని.. నితీశ్​ కుమార్​ అధోగతివైపు నెడుతున్నారని విమర్శించారు. దీనికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

కేసు ఏంటంటే?
2004-2009 మధ్యలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేల్లో గ్రూప్-డీ ఉద్యోగాలు ఇప్పించి.. ఆ డబ్బుతో భూమిని కొనుగోలు చేశారని సీబీఐ ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. పట్నా జోన్​కు చెందిన కొందరికి కోల్​కతా, ముంబయి, జైపుర్, జబల్​పుర్ వంటి జోన్లలో ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపించింది. ఇందుకు బదులుగా ఆ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు.. తమ భూములను లాలూ ప్రసాద్​కు, ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి బదిలీ చేశారని సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూ ప్రసాద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమన్లు జారీ చేసింది. ఈ కేసుపైనే లాలూ ప్రసాద్ యాదవ్​ సహా ఆయన భార్య రబ్రీదేవిని సోమవారం సీబీఐ విచారించింది. మంగళవారం లాలూ ప్రసాద్ యాదవ్​ను మరోసారి ప్రశ్నించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.