ETV Bharat / bharat

మైనర్​పై వలస కూలీలు గ్యాంగ్​రేప్.. రైల్వే ట్రాక్​ దగ్గర వదిలి పరార్​.. కోడలిని చంపిన మామ! - పంజాబ్ లుథియానా న్యూస్

టీనేజర్​పై అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు వలస కూలీలు. ఈ దారుణం కేరళలో జరిగింది. మరోవైపు, కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. సొంత కోడలినే కత్తితో పొడిచి హతమార్చిన ఘటన పంజాబ్​లో జరిగింది.

gang rape
గ్యాంగ్ రేప్
author img

By

Published : Sep 24, 2022, 4:46 PM IST

Updated : Sep 24, 2022, 5:08 PM IST

మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు వలస కూలీలు. ఈ ఘటన కేరళలోని కోజీకోడ్​లో జరిగింది. నిందితులందరినీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన 16 ఏళ్ల బాలికకు రైలు ప్రయాణంలో ప్రధాన నిందితుడితో పరిచయం ఏర్పడింది. ఆమె తన సోదరిని కలవడానికి వారణాసి నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే నిందితుడు.. బాధితురాలికి మాయమాటలు చెప్పి ఆమెను చెన్నైలో దిగకుండా చేశాడు. అనంతరం తనతో కలిసి పాలక్కడ్ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఆమెతో కలిసి కోజీకోడ్​కు చేరుకున్నాడు. ఆ తర్వాత బాధితురాల్ని పాళయంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాల్ని కోజీకోడ్ రైల్వే స్టేషన్​ పట్టాల దగ్గర వదిలేసి పరారయ్యారు. ప్రధాన నిందితుడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వ్యక్తేనని పోలీసులు తెలిపారు.

టీనేజర్​పై దారుణం..
ఉత్తర్​ప్రదేశ్ ప్రతాప్​గఢ్​లో దారుణం జరిగింది. ఓ టీనేజర్​పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దెల్హపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది బాధితురాలు. అయితే గజేడ అటవీ ప్రాంతంలో మరో ఇద్దరితో కలిసి టీనేజర్​ స్నేహితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం దారుణాన్ని వీడియో తీశాడు. అత్యాచారం జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాల్ని బెదిరించాడు. అనంతరం బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. రోడ్డుపక్కన ఉన్న బాలికను చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలికను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశామని.. పరారీలో ఉన్న మరొకరిని నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

కోడలినే చంపిన మామ..
సొంత కోడలినే హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన పంజాబ్​ లుధియానాలోని సీఎంసీ కాలనీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. నిందితుడిని అరవింద్​గా పోలీసులు గుర్తించారు. ఇంటి స్థలం విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. బాధితురాలిపై నిందితుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అడ్డుకునేందుకు ఆమె భర్త అడ్డుపడగా.. అతడిపై కూడా దాడిచేశారని తెలిపారు.

భార్యను గొంతుకోసి..
మహారాష్ట్ర ఠానేలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యనే గొంతుకోసి కడతేర్చాడు ఓ వ్యక్తి. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. బాధితురాలు మీనా(25)కు అనిల్ లక్ష్మణ్(28) కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. శుక్రవారం తెల్లవారుజామున నిందితుడు అనిల్.. తన భార్య మీనను కత్తితో గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు అనిల్​ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి: దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. ఆన్​లైన్ చైల్డ్​​ పోర్నోగ్రఫీ ముఠాలే లక్ష్యం!

'భారత్​ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర'.. 'PFIని బ్యాన్ చేయండి'

Last Updated : Sep 24, 2022, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.