ETV Bharat / bharat

న్యాయమూర్తి ఔదార్యం- దివ్యాంగుడి కారు వద్దే తీర్పు

కోర్టు ముందుకు నడిచి రాలేని ఓ దివ్యాంగుడిని వెతుక్కుంటూ న్యాయమూర్తే వెళ్లారు. రోడ్డుపై అతని కారు వద్దే తీర్పు చెప్పారు. ప్రమాదంలో వికలాంగుడిగా మారిన వ్యక్తికి రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించారు. ఈ సంఘటన ఛత్తీస్​గఢ్​ కొర్బా జిల్లాలో జరిగింది.

verdict by reaching the car
దివ్యాంగుడి కారు వద్దే తీర్పు
author img

By

Published : Sep 12, 2021, 8:45 PM IST

కోర్టు ప్రాంగణంలో వాదోపవాదలు విన్న తర్వాత.. న్యాయమూర్తి తీర్పులు చెప్పటం సర్వసాధారణం. అయితే.. ఓ న్యాయమూర్తి.. తమ ముందుకు రాలేని దివ్యాంగుడి కారు వద్దకే వెళ్లి తీర్పు చెప్పారు. ఈ సంఘటన ఛత్తీస్​గఢ్​ కొర్బా జిల్లాలో జరిగింది.

జిల్లా కేంద్రంలో శనివారం ప్రత్యేక లోక్​ అదాలత్​ నిర్వహించారు. ఈ క్రమంలో ధర్మాసనం ముందుకు ఓ దివ్యాంగుడి కేసు వచ్చింది. అయితే.. అక్కడి వరకు రాలేని పిటిషనర్​ ఇబ్బందిని గుర్తించిన జిల్లా సెషన్స్​ కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ బీపీ వర్మ.. దివ్యాంగుడి కారు వద్దకే వచ్చి విషయం తెలుసుకున్నారు. అతని కేసుకు సంబంధించిన పత్రాలు అక్కడికే తెప్పించుకున్నారు. కేసుకు సంబంధించిన వారందరిని కారు వద్దకే రమ్మని ఆదేశించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత బీమా సంస్థ, పిటిషనర్​ల మధ్య సయోధ్య కుదిర్చారు. ఇరువురి మధ్య ఓ ఒప్పందం కుదిరిన క్రమంలో.. రోడ్డుపైనే తీర్పు చెప్పారు. బాధితుడికి బీమా కంపెనీ రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

verdict by reaching the car
కారు వద్ద మాట్లాడుతున్న న్యాయమూర్తి
verdict by reaching the car
కారు వద్ద కేసు వివరాలు తెలుసుకుంటున్న న్యాయమూర్తి

కేసు ఏమిటి?

జిల్లాకు చెందిన ద్వారకా ప్రసాద్​ కన్వార్​.. 2018, డిసెంబర్​ 3న కోర్బాకు కారులో వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అతను వికలాంగుడిగా మారాడు. బీమా సంస్థ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తనకు పరిహారం చెల్లించాలని బీమా సంస్థపై కేసు వేశాడు. అయితే.. మూడేళ్ల నుంచి అతని కేసు కోర్టులో పెండింగ్​లోనే ఉంది.

శనివారం నిర్వహించిన లోక్​అదాలత్​లో ఈ కేసుకు పరిష్కారం లభించింది. దాంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కోర్టు మానవీయం కోణంలో ఆలోచించి తనకు అనుకూలంగా తీర్పు చెప్పటంపై సంతోషం వ్యక్తం చేశారు కన్వార్​.

ఇదీ చూడండి: సొంతిల్లు, సొంత వాహనం లేని ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.