ఛత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును మెట్రో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు. సోమవారం వేకువజామున 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రుల్ని హైవే పెట్రోలింగ్ సిబ్బంది.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాయ్‌పుర్ నుంచి సీతాపుర్‌కు మెట్రో బస్సు వెళ్తుండగా పొండి ఉపోర్దా హైవేపై ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
మృతదేహాలను స్థానిక కమ్యూనిటీ సెంటర్‌కు తరలించారు పోలీసులు. క్షతగాత్రులకు స్థానికులు సహాయం చేశారు. ప్రమాదానికి గురైన బస్సును బాంగో పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.
ఇవీ చదవండి: పిల్లలకూ చుక్కల మందు టీకా.. ఆ ప్రయోగాలకు అనుమతి కోరిన భారత్ బయోటెక్
'కశ్మీర్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదు..' ఆజాద్ కీలక వ్యాఖ్యలు