కేరళలో తొలి దశ స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మొత్తం 6,910 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ప్రజలు కరోనా నిబంధనలను పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
![Kerala civic body polls underway amid corona crisis](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9801081_kerala.jpg)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్.. తిరువనంతపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. కేంద్రమంత్రి మురళీధరన్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
![Kerala civic body polls underway amid corona crisis](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9805791_1.jpg)
![Kerala civic body polls underway amid corona crisis](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9805791_2.jpg)
![Kerala civic body polls underway amid corona crisis](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9801081_rajasekharan.jpg)
తొలిదశ పోలింగ్‌లో మొత్తం 24,584 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 41,58,341 మంది పురుషులు; 46,68,209 మంది మహిళలు సహా.. 70 మంది ట్రాన్స్జెండర్లు ఈ దఫా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి:- నాడు జవాన్‌ను కాపాడింది.. నేడు రాజకీయాల్లోకి వస్తోంది