ETV Bharat / bharat

'లిక్కర్‌ స్కామ్‌ అనేదే లేదు.. అన్నీ తప్పుడు ఆరోపణలే.. 9గంటల్లో 56 ప్రశ్నలు..' - దిల్లీ ఎక్సైజ్ కుంభకోణం

kejriwal cbi investigation
kejriwal cbi investigation
author img

By

Published : Apr 16, 2023, 10:05 AM IST

Updated : Apr 16, 2023, 10:07 PM IST

21:47 April 16

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు సీబీఐ అధికారులు.. కేజ్రీవాల్​ను ప్రశ్నించారు. ఉదయం 11 గంటల తర్వాత సెంట్రల్ దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన కేజ్రీ.. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బయటకొచ్చారు. అనంతరం కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు.

"సీబీఐ దాదాపు 9 గంటల పాటు నన్ను ప్రశ్నించింది. సీబీఐ అడిగిన 56 ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. మద్యం కుంభకోణంలో అన్నీ తప్పుడు ఆరోపణలతో రాజకీయం చేస్తున్నారు. ఆప్ 'కత్తర్ ఇమాందార్ పార్టీ'. ఆప్‌ను అంతం చేయాలనుకుంటున్నారు. కానీ, దేశ ప్రజలు మాతోనే ఉన్నారు" అంటూ వ్యాఖ్యలు చేశారు. అసలు లిక్కర్‌ స్కామ్‌ అనేది లేదన్నారు కేజ్రీవాల్‌. కావాలనే ఇదంతా చేస్తున్నారని కేజ్రీవాల్‌ మండిపడ్డారు.

అయితే, లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి సమాచారాన్ని సేకరించే క్రమంలో కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో సీఆర్‌పీసీ 161 కింద కేజ్రీవాల్‌ స్టేట్‌మెంట్‌ను సైతం రికార్డు చేశారు. లిఖితపూర్వకంగా కూడా స్టేట్‌మెంట్‌ తీసుకున్నట్లు సమచారం.

20:32 April 16

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు సీబీఐ అధికారులు.. కేజ్రీవాల్​ను ప్రశ్నించారు. ఉదయం 11 గంటల తర్వాత సెంట్రల్ దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన కేజ్రీ.. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బయటకొచ్చారు.

20:03 April 16

దిల్లీ మద్యం కుంభకోణంలో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విచారణ కొనసాగుతోంది. దాదాపు 8 గంటలు దాటినా సీబీఐ విచారణ సాగుతోంది. ఉదయం 11 గంటల తర్వాత సెంట్రల్ దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి కేజ్రీవాల్‌ చేరుకున్నారు. ఆయన వెంట పంజాబ్ సీఎం భగవంత్ మాన్, దిల్లీ మంత్రులు, ఆప్ ముఖ్యనేతలు వెళ్లారు.

11:18 April 16

సీబీఐ ఆఫీసుకు కేజ్రీ
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. దిల్లీ మద్యం కేసులో విచారణ నిమిత్తం సీబీఐ ఆఫీసుకు వచ్చారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని కేజ్రీవాల్ మరోసారి స్పష్టం చేశారు. తన అరెస్ట్ గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, సీబీఐని పూర్తిగా బీజేపీనే నియంత్రిస్తోందని ఆరోపించారు.

10:59 April 16

kejriwal cbi investigation
మహాత్ముడికి కేజ్రీవాల్ నివాళి.

మహాత్ముడికి నివాళులు
మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు రాజ్​ఘాట్​ను సందర్శించారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం.. కేజ్రీ వెంట వెళ్లారు.

10:16 April 16

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు హాజరుకానున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు మద్దతుగా ఆమ్​ఆద్మీ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దిల్లీలోని కశ్మీరీ గేట్ దగ్గర ఆందోళనకు దిగిన కొందరు ఆప్​ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

09:43 April 16

'సీబీఐకి నిజాయితీగా సమాధానాలిస్తా.. నా అరెస్ట్​కు బీజేపీ ఆదేశాలు'

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెబుతానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి.. దాచిపెట్టేందుకు ఏమీ లేదని ఆదివారం అన్నారు. తన అరెస్ట్​కు బీజేపీ ఆదేశాలు ఇచ్చిందని, సీబీఐ వాటిని తప్పక పాటిస్తుందని ఆరోపించారు. దిల్లీ మద్యం పాలసీలో అవకతవకలపై సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

"నేను అవినీతిపరుడినని అంటున్నారు. నేను డబ్బు సంపాదించాలని అనుకుంటే ఐటీ శాఖలో కమిషనర్​గా పనిచేసినప్పుడు కోట్లు వెనకేసుకునేవాడిని. అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపరుడు అయితే.. ప్రపంచంలో మరెవరూ నిజాయితీపరులు కాదన్నట్లే. వారు (బీజేపీ) చాలా శక్తిమంతమైన వ్యక్తులు. ఎవరినైనా జైలుకు పంపించగలరు. నన్ను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు సీబీఐని డిమాండ్ చేస్తున్నారు. నా అరెస్ట్​ కోసం బీజేపీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి ఉండొచ్చు. బీజేపీ ఆదేశాలను సీబీఐ తప్పక పాటిస్తుంది. ఆదేశాలు ఇచ్చేది బీజేపీ అయితే ఇక సీబీఐ ఎందుకు? సీబీఐ నన్ను అరెస్ట్ చేస్తుంది. దేశాన్ని, భరతమాతను ప్రేమిస్తా. దేశం కోసం జీవితాన్ని కూడా అర్పిస్తా."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం సీబీఐ కార్యాలయానికి వెళ్లనున్నారు. కేజ్రీవాల్​ను సీబీఐ ప్రశ్నించనున్న నేపథ్యంలో రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ముందుజాగ్రత్తగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వెయ్యి మందికి పైగా దళాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీబీఐ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. నలుగురు కన్నా ఎక్కువ మంది ఒక్క చోట ఉండకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ఆప్ కార్యాలయం వద్ద కూడా సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.

సీబీఐ అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలు ఇవే!
దిల్లీ మద్యం విధానానికి సంబంధించి కేజ్రీవాల్​ను సీబీఐ పలు కీలక ప్రశ్నలు అడగనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీని రూపొందించడానికి ఏ ప్రక్రియ అనుసరించారనే విషయంపై ఆరా తీయనున్నట్లు సమాచారం. మంత్రివర్గం వద్దకు వచ్చిన మద్యం విధానం ఫైలు ఎలా అదృశ్యమైందని ప్రశ్నించే అవకాశం ఉంది. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పాత్ర ఏంటని అడిగే అవకాశం ఉంది. దక్షిణాది లాబీకి అనుకూలంగా లిక్కర్ పాలసీ ఉందన్న ఆరోపణలపై అభిప్రాయం చెప్పాలని అడగనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వీటిపై కేజ్రీవాల్ చెప్పే సమాధానాలను బట్టి విచారణపై సీబీఐ ముందుకెళ్లే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

సీబీఐ విచారణకు అరవింద్​ కేజ్రీవాల్​.. అరెస్ట్​ చేస్తారా?

Last Updated : Apr 16, 2023, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.