ETV Bharat / bharat

మందు కోసం గొడవ.. యువకుడ్ని కొట్టిచంపిన తండ్రి, అన్న.. ఇంటి వెనుకే అంత్యక్రియలు - కంపెనీ ఎండీ హత్య

మద్యం కోసం గొడవపడిన ఓ యువకుడిని.. తన తండ్రి, సోదరుడు కొట్టి చంపారు. అనంతరం ఇంటి వెనుక అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటకలోని బెళగావిలో జరిగిందీ ఘటన. మరోవైపు, ఓ ప్రైవేట్ కంపెనీ ఎండీ, సీఈఓను హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

karnataka man kills his son
కుమారుడ్ని కర్రతో కొట్టి చంపిన తండ్రి
author img

By

Published : Jul 12, 2023, 2:19 PM IST

Updated : Jul 12, 2023, 3:05 PM IST

Karnataka Man Kills Son : మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ ఇంట్లో గొడవకు దిగిన యువకుడ్ని.. అతడి తండ్రి, సోదరుడు కలిసి కర్రతో కొట్టి చంపారు. అనంతరం ఇంటి వెనకాల స్థలంలో అంత్యక్రియలు కూడా నిర్వహించారు. యువకుడి మృతి పట్ల అనుమానం వచ్చిన గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడి తండ్రి, సోదరుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్ణాటక బెళగావి జిల్లా హిడ్కల్ గ్రామానికి చెందిన మహాలింగయ్య గురుసిద్ధయ్య హిరేమఠ్​ (54) అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు. మొదటివాడు బసయ్య హిరేమఠ్(26), రెండో కుమారుడు సోమయ్య మహాలింగయ్య (24). అయితే గురుసిద్ధయ్య చిన్న కుమారుడు సోమయ్య గత కొంత కాలంగా మద్యపానానికి అలవాటు పడ్డాడు. సోమయ్య రోజూ ఇంటికి తాగి వచ్చి గొడవ చేసేవాడు.

రోజురోజుకూ సోమయ్య ప్రవర్తనతో కుటుంబ సభ్యులు విసుగుచెందారు. ఈ క్రమంలో జులై 10వ తేదీన సోమయ్య.. మద్యం తాగడానికి తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. మాటామాటా పెరిగి గొడవ తీవ్రమైంది. సోమయ్య తండ్రి గురుసిద్ధయ్య, తన పెద్ద కుమారుడు బసయ్య కలిసి.. అతడి తలపై కర్రతో బలంగా కొట్టారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సోమయ్య అక్కడికక్కడే మరణించాడు.

కొడుకు చనిపోయిన తర్వాత గురుసిద్ధయ్య.. తన ఇంటి వెనకాలే అంత్యక్రియలు నిర్వహించాడు. కానీ సోమయ్య మృతి పట్ల అనుమానంతో గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నట్లు గ్రామస్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్​పీ సంజీవ్ పాటిల్.. ఘటనా స్థలికి చేరుకొని మృతుడి తండ్రిని, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం కాలిన మృతదేహం అవశేషాలను ల్యాబ్​కు పంపారు.

ప్రైవేట్ కంపెనీ ఎండీ, సీఈఓ దారుణ హత్య..
ఓ ప్రైవేటు కంపెనీ ఎండీ, సీఈఓను హత్యచేసిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. నిందితులను ఫెలిక్స్, వినయ్ రెడ్డి, శివగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

ఏరోనిక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్యం, ఆ కంపెనీ సీఈఓ (CEO) విను కుమార్​ను ముగ్గురు దుండగులు కలిసి పదునైన ఆయుధంతో మంగళవారం హత్య చేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి.. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను.. మంగళవారం రాత్రి కుణిగల్ ప్రాంతంలో అమ్రితల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

హత్యకు గురైన ఫణీంద్ర, వినుకుమార్, నిందితుల్లో ఒకడైన ఫెలిక్స్ గతంలో బన్నేరుఘట్ట రోడ్డులోని ఓ కంపెనీలో కలిసి పనిచేశారు. కొన్ని కారణాల వల్ల ఫెలిక్స్‌ను కంపెనీ నుంచి యాజమాన్యం తొలగించింది. తన ఉద్యోగం పోవడానికి ఫణీంద్ర కారణమని అతడిపై పగ పెంచుకున్నాడు ఫెలిక్స్. మరో ఇద్దరితో కలిసి ఫణీంద్ర హతమార్చాడు. అలాగే వారికి అడ్డువచ్చిన వినుకుమార్​ను కూడా చంపేశారు.

Last Updated : Jul 12, 2023, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.