ETV Bharat / bharat

Karnataka Assembly Election Results : కర్ణాటకలో ఎవరికెన్ని సీట్లు వచ్చాయంటే..

author img

By

Published : May 13, 2023, 6:05 PM IST

Updated : May 14, 2023, 3:49 PM IST

Karnataka Assembly Election Results : కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టారు. హంగ్‌కు, సందిగ్ధతలకు ఏమాత్రం తావులేకుండా హస్తం పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ కట్టబెట్టారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను సైతం మించిపోయేలా కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో గట్టెక్కుతామని భావించిన భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. కింగ్‌మేకర్‌ కావాలనుకున్న జేడీఎస్‌.. ఇన్నాళ్లూ కంచుకోటగా ఉన్న స్థానాలను సైతం కోల్పోయి డీలా పడింది.

karnataka assembly election 2023 results
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల 2023 ఫలితాలు

Karnataka Assembly Election Results : కర్ణాటక ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. 224 స్థానాలు ఉన్న కర్ణాటకలో 135 స్థానాల్లో.. హస్తం పార్టీ జయభేరి మోగించింది. మళ్లీ అధికారంలోకి వస్తామని భావించిన భారతీయ జనతా పార్టీ 66 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జేడీఎస్‌ 19 స్థానాలకే పరిమితంకాగా.. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన సర్వోదయ కర్ణాటక పక్ష ఒక స్థానంలో విజయం సాధించింది. ఈ విజయంతో 2013 తర్వాత స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బెంగళూరు, కోస్టల్‌ కర్ణాటకల్లో మాత్రమే.. కాస్త మెరుగైన ప్రదర్శనను కనబరిచిన భాజపా ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది.

మొత్తం స్థానాలు224
కాంగ్రెస్​ 135
బీజేపీ 66
జేడీఎస్​ 19
ఇతరులు4

ప్రాంతాల వారీగా..

  • సెంట్రల్ కర్ణాటకలో 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 19 చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించింది. భాజపా 5, జేడీఎస్‌ ఒక చోట గెలిచాయి.
  • కల్యాణ కర్ణాటక ప్రాంతంలోని 41 స్థానాల్లో కాంగ్రెస్ 26 స్థానాలను హస్తగతం చేసుకుంది. భాజపా 10 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జేడీఎస్‌ 3, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు.
  • కిట్టూరు కర్ణాటక ప్రాంతంలోని 50 స్థానాల్లో 33 కాంగ్రెస్‌ ఖాతాలోనే పడ్డాయి. భాజపా 16 నియోజకవర్గాల్లో గెలిచింది. జేడీఎస్‌ ఒక చోట విజయం సాధించింది.
  • పాత మైసూరు ప్రాంతంలో 61 స్థానాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, జేడీఎస్‌ మధ్యే నడిచింది. భాజపా నామమాత్రంగానే ఉనికిని చాటింది. కాంగ్రెస్ 39 చోట్ల జయభేరి మోగించింది. కంచుకోట అయిన మైసూరులో జేడీఎస్‌ 14 స్థానాలకే పరిమితమైంది. భాజపా 6 చోట్ల గెలవగా..ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు.
  • పట్టణ, కోస్తా ప్రాంతాల్లో మాత్రమే కమళదలం.. తన పట్టునిలుపుకోగలిగింది. బెంగళూరు రీజియన్‌లో 28అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 15 స్థానాల్లో కమలదళం గెలిచింది. భాజపాకు గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ 13 స్థానాలను కైవసం చేసుకుంది.
  • కోస్టల్ కర్ణాటకలో కమలదళం సత్తా చాటింది. మొత్తం 19 స్థానాల్లో 13 తమ ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌ ఆరు చోట్ల విజయం సాధించింది. జేడీఎస్ ఊసే లేకుండా పోయింది.

లింగాయత్‌ల ప్రాబల్యం కలిగిన ఉత్తర కర్ణాటకలో.. భాజపాను కాంగ్రెస్‌ గట్టి దెబ్బ కొట్టింది. లింగాయత్‌ వర్గానికి చెందిన ప్రధాన నాయకులను.. పక్కనపెట్టిన భాజపాకు ఫలితాలు కూడా ప్రతికూలంగానే వచ్చాయి. యడియూరప్ప, ఈశ్వరప్ప, జగదీశ్‌ షెట్టార్‌ వంటి బలమైన నాయకులను.. భాజపా తప్పించింది. టికెట్‌ నిరాకరించడం వల్ల భాజపాను వదిలిన జగదీశ్‌ శెట్టర్‌.. కాంగ్రెస్‌లో చేరారు. మిస్టర్‌ 40 శాతం పేరుతో ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను దూరంగా పెట్టారు. ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై లింగాయత్‌ నాయకుడే అయినా ఆయన తన వర్గం నుంచి సంపూర్ణ మద్దతును కూడగట్టలేకపోయారు.

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాలు గెలిచిన భాజపా ఇప్పుడు 39 స్థానాలు కోల్పోయి 65 సీట్లతోనే సరిపెట్టుకుంది. 2018లో 80 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి 56 స్థానాలు పెంచుకుని 136 స్థానాలతో తిరుగులేని సత్తా చాటింది. 2018లో 37 స్థానాలు నెగ్గిన జేడీఎస్‌ ఈసారి ఏకంగా 18 స్థానాలు కోల్పోయింది.

Last Updated : May 14, 2023, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.