ETV Bharat / bharat

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ.. ఆ పార్టీతో పొత్తుకు సై!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం పార్టీ ప్రకటించింది. జేడీఎస్​ పార్టీతో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అందుకోసం దేవెగౌడతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.

author img

By

Published : Apr 4, 2023, 5:48 PM IST

karnataka assembly election 2023
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023

వచ్చే నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం​ పార్టీ సిద్ధమైంది. తాము 25 స్థానాల్లో పోటీ చేస్తామని ఆ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు.. ఉస్మాన్ ఘనీ మంగళవారం వెల్లడించారు. జేడీఎస్​ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తాము సుముఖంగా ఉన్నట్లు ఉస్మాన్ ఘనీ తెలిపారు. "జేడీఎస్​తో ఎమ్​ఐఎమ్​ పొత్తుపై ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ప్రధాని ఎచ్​డీ దేవేగౌడతో.. చర్చలు జరుపుతున్నాం. పార్టీ అభిప్రాయాన్ని ఆయనకు చెప్పాం. కానీ దేవెగౌడ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు" అని ఉస్మాన్ ఘనీ అన్నారు.

ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్​ లోక్​సభ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ సైతం తాము కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు తాము ముగ్గురు అభ్యర్థులను ప్రకటించామని పేర్కొన్నారు. జేడీఎస్​తో​ పొత్తుకు ఎంఐఎం సిద్ధంగా ఉందన్న ఆయన.. దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమన్నారు. పొత్తు కోసం వేచి చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్​ తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్న అసదుద్దీన్ ఒవైసీ.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనే లేదన్నారు.

కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై.. అసదుద్దీన్ ఒవైసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమన్నారు. దీనిపై ఎందుకు నిరసనలు జరగలేదన్నారు. సెక్యులర్ నాయకులు, పార్టీలుగా చెప్పుకునే వారి నుంచి ఎందుకు స్పందన రాలేదని పరోక్షంగా కాంగ్రెస్​ను ప్రశ్నించారు.

ముస్లిం ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం​ అభ్యర్థులను నిలుపుతోందని కాంగ్రెస్ విమర్శిస్తున్న వేళ.. దీనిపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లింగాయత్‌లు, వొక్కలిగలు, కురుబలు వంటి ఇతర సంఘాల నాయకులకు ఇలాంటి ప్రశ్న ఎందుకు వేయరని ప్రశ్నించారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో కర్ణాటకలో తాము అభ్యర్థులను నిలపలేదని గుర్తు చేసిన ఒవైసీ.. అప్పుడు కాంగ్రెస్​ ఒక్క సీటు మాత్రమే గెలిచిందన్నారు. 'ముస్లిం ఓట్ల విభజన వల్ల ఇది జరిగిందా? లేక బీజేపీకి మెజారిటీ ఓట్లు ఏకీకృతం కావడం వల్ల జరిగిందా?' అని ఒవైసీ ప్రశ్నించారు. కాంగ్రెస్​ పార్టీ ఫిరాయింపుదారుల కారణంగానే 2019లో కర్ణాటకలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్​ పార్టీకి ఎంఐఎం పూర్తి మద్దతునిచ్చింది. కానీ అభ్యర్థులను నిలపలేదు. 2022లో జరిగిన గుజరాత్, ఉత్తరాఖండ్​​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎం​ఐఎం పోటీ చేసింది. 2021లో బంగాల్, 2017 యూపీ​ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. కానీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.