ETV Bharat / bharat

అయోధ్య గుడికి వెళ్లే రోడ్డుకు కల్యాణ్ సింగ్ పేరు - కల్యాణ్ సింగ్ మృతి

ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. కల్యాణ్ సింగ్ భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు పార్టీ నేతలు, అభిమానులు తరలి వచ్చారు. మరోవైపు, అయోధ్య సహా పలు నగరాల్లో రహదారులకు కల్యాణ్ సింగ్ పేరు పెట్టనున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.

kalyan singh last rites
కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు
author img

By

Published : Aug 23, 2021, 3:46 PM IST

Updated : Aug 23, 2021, 7:02 PM IST

ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు(Kalyan Singh last rites) అధికారిక లాంఛనాలతో జరిగాయి. బులంద్​షహర్ జిల్లా నరోరాలోని రాజ్​ఘాట్ వద్ద కల్యాణ్ సింగ్ భౌతికదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Kalyan Singh's cremation in Bulandshahr
పోలీసుల గౌరవ వందనం
Kalyan Singh's cremation in Bulandshahr
చితికి నిప్పంటించిన తర్వాత..

అంతకుముందు ఉదయం.. కల్యాణ్ సింగ్ భౌతికకాయాన్ని ఆయన స్వస్థలమైన మధోలీకి తీసుకెళ్లారు. చివరిసారిగా ఆయన్ను చూసేందుకు రాజకీయ నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Kalyan Singh's cremation in Bulandshahr on Monday afternoon
అంత్యక్రియలకు ముందు..

నివాళులు అర్పిస్తున్న యోగి ఆదిత్యనాథ్

పుష్పగుచ్చంతో రాజ్​నాథ్ నివాళులు

షా నివాళి

మధోలీ సమీపంలోని అత్రౌలీ వద్ద కల్యాణ్ సింగ్ భౌతికకాయాన్ని సందర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఆయనకు నివాళులు(Amit Shah tributes to Kalyan Singh) అర్పించారు. కల్యాణ్ సింగ్ మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. అణగారిణ వర్గాలు తమ శ్రేయోభిలాషిని కోల్పోయాయని అన్నారు. 'రామజన్మభూమి ఆందోళనల్లో కల్యాణ్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. అందుకోసం ప్రభుత్వాన్నీ వదులుకునేందుకు వెనకడుగు వేయలేదు. ఆయన ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికే పనిచేశారు. పేదల కోసం తన జీవితం అంకితమిచ్చారు' అని కల్యాణ్ సింగ్ గురించి స్మరించుకున్నారు అమిత్ షా.

Kalyan Singh's cremation in Bulandshahr
యోగి ఆదిత్యనాథ్, రాజ్​నాథ్ సింగ్

రహదార్లకు కల్యాణ్ సింగ్ పేరు

కల్యాణ్ సింగ్ చేసిన సేవలకు గుర్తుగా యూపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రామజన్మభూమి మందిరానికి వెళ్లే రహదారికి ఆయన పేరు పెడుతున్నట్లు తెలిపింది. లఖ్​నవూ, ప్రయాగ్​రాజ్​, బులంద్​షహర్​, అలీగడ్​ పట్టణాల్లోనూ ఒక్కో రహదారికి కల్యాణ్ సింగ్​ పేరు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇది ఆయనకు నివాళి అని యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు.

శనివారం కన్నుమూత

తీవ్ర అనారోగ్య సమస్యలతో గత కొన్నాళ్లుగా బాధపడుతున్న కల్యాణ్ సింగ్(kalyan singh demise).. లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

దేశ రాజకీయాల్లో కల్యాణ్​సింగ్​ది కీలక పాత్ర. ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. రాజస్థాన్​ గవర్నర్​గానూ సేవలందించారు. భారతీయ జనతా పార్టీలో కీలకమైన నేతగా ఎదిగారు. 1992లో బాబ్రీ మసీదు ఘటన సమయంలో యూపీ సీఎంగా ఉన్నది ఆయనే. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగానూ ఎన్నికయ్యారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 23, 2021, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.