ETV Bharat / bharat

YCP Leaders Irregularities: అతడొక అరాచకం.. అండర్‌వరల్డ్‌ మాఫియాను మించి దందాలు.. ‘ప్రభుత్వ పెద్ద’ అండదండలతోనే.! - వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అక్రమాలు

Kakinada YSRCP Leader Irregularities: ఆయన కన్ను పడిందంటే భూములు కబ్జా అయిపోతాయ్.. ధనదాహానికి కొండలు, గుట్టలు కరిగిపోతాయ్.. ఆయన రౌడీయిజానికి పోలీసులూ జీ హుజూర్‌ అంటారు. ఏ లావాదేవీ జరగాలన్నా కప్పం కట్టితీరాలి. ఆయన సెటిల్మెంట్లకు ఎంతటివారైనా తలొగ్గాల్సిందే. బియ్యం మాఫియా అంటే రాష్ట్రమంతా గుర్తొచ్చేది ఆయన పేరే. ఒకప్పుడు మాఫియా డాన్లు ముంబయి మహానగరాన్ని వణికిస్తే.. కాకినాడ జిల్లాకు చెందిన ఈ నాయకుడు ప్రజాజీవితంలో ఉంటూనే మాఫియా నడిపిస్తున్నారు. "ప్రభుత్వ పెద్ద" అండదండలతో పక్క నియోజకవర్గాలకూ దందాలను విస్తరించారు. ప్రతిపక్షాలపైకి కిరాయిమూకలను ఉసిగొల్పుతుంటారు. ప్రశ్నిస్తే సొంత పార్టీ నాయకులపైనా దాడికి తెగబడతారు. మంత్రులకు మించి అధికారం చెలాయిస్తున్న ఆ నాయకుడి అక్రమాలు, అరాచకానికి.. వ్యవస్థలు సైతం దాసోహమైపోయాయి.

kakinand key leader
kakinand key leader
author img

By

Published : Jul 6, 2023, 7:12 AM IST

అతడొక అరాచకం.. అండర్‌వరల్డ్‌ మాఫియాను మించి దందాలు

Kakinada YSRCP Leader Irregularities: కాకినాడ జిల్లాలో వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ కీలక ప్రజాప్రతినిధి అక్రమాలు, అరాచకాలకు అంతే లేకుండా పోయింది. అరాచకానికి పేటెంట్‌ రైట్‌ తనదే అన్నట్లుగా వ్యవహరించే ఆ నాయకుడు.. అధికార దురహంకారంతో రెచ్చిపోతున్నారు. ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని నియోజకవర్గమంతా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ పెద్ద అండతో పక్క నియోజకవర్గాల్లోనూ అరాచకాలు, అక్రమాలకు తెగబడుతున్నారు. ఈ దందాల్లో ఎక్కడా చేతికి మట్టి అంటకుండా అంతా అనుచరులతోనే చక్కబెడుతున్నారు. జగ్గంపేట, పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల పరిధిలో.. భారీగా అక్రమ మైనింగ్‌ చేస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దాపురం - గండేపల్లి మండలాల పరిధిలోని రామేశ్వరం మెట్టలో వందల ఎకరాల్లో గ్రావెల్‌ కొల్లగొట్టారు. కొంత విస్తీర్ణంలో తవ్వకాలకు అనుమతులు పొంది.. మొత్తం మెట్టను గుల్ల చేశారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో జగనన్న కాలనీల లేఅవుట్లను ఈ అక్రమ గ్రావెల్‌తో చదును చేసి.. గుత్తేదారుల పేరుతో కోట్ల రూపాయల్లో బిల్లులు చేయించుకున్నారు. కరప మండలం అరట్లకట్ట జలాశయంలో పూడిక తొలగింపు కాంట్రాక్టును తనవాళ్లకు ఇప్పించుకుని.. ఆ మట్టినీ అమ్మేసుకున్నారు. దీనికోసం అరట్లకట్ట నుంచి అచ్యుతాపురత్రయం, కొవ్వాడ పరిధిలో పొలాల మధ్య నుంచి రోడ్డు వేసి... దారిలో చెట్లను ఇష్టానుసారం నరికేశారు. వినియోగంలో లేని కాకినాడ - కోటిపల్లి రైలు మార్గంలో కొంత భాగాన్ని, రైతులకు ఉపయోగపడే భారీ డ్రెయిన్‌ను మట్టితో కప్పేశారు. ఇంత అరాచకం జరిగినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు.

బెదిరించి, భయపెట్టి.. భూములు లాక్కున్నారు: సామ-దాన-భేద-దండోపాయాలు ప్రయోగించి కోట్ల విలువైన ఆస్తులు కూడగట్టుకున్న ఆ నాయకుడు.. ఇటీవల మరింత దూకుడు పెంచారు. అనుచరులను రంగంలోకి దించి నియోజకవర్గ పరిధిలో ఖాళీ స్థలాల వివరాలు సేకరిస్తున్నారు. లిటిగేషన్‌ ఉన్న భూముల సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. యజమానులను భయపెట్టి, బెదిరించి విలువైన ఖాళీ భూములను నామమాత్రపు ధరకే లాక్కుంటున్నారు. ఎవరైనా ఎదురుతిరిగితే ఆ స్థలంపై కొత్త వివాదాలు తెరపైకి తెచ్చి.. వాళ్లంతట వాళ్లే తక్కువ మొత్తానికి అమ్ముకునేలా చేస్తున్నారు. మరికొన్ని భూములను నేరుగా కబ్జా చేస్తూ.. ఆ స్థలం తమదని ముందుకొచ్చిన యజమానులను బెదిరిస్తున్నారు. ఇక న్యాయపరమైన చిక్కులున్న భూముల్ని గుర్తించి, యజమానులతో సంప్రదింపులు జరుపుతారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ వారికి కొంత మొత్తమిచ్చి, నయానోభయానో పత్రాలు దక్కించుకుంటారు. వివాదాస్పద భూములైనా, ప్రభుత్వ భూమైనా అధికార బలంతో హక్కులు తారుమారు చేస్తారు. ఇలా వందల కోట్ల విలువైన స్థలాలు బినామీల పేరుతో ఇప్పటికే చేతులు మారిపోయాయి.

రూ.100 కోట్ల విలువైన భూదాన భూములు కాజేసే కుట్ర: కాకినాడలో 100 కోట్ల రూపాయల విలువైన భూదాన యజ్ఞ బోర్డు భూములపై కన్నేసిన ఈ నాయకుడు.. గత సంవత్సరం ఫిబ్రవరిలో అనుచరులతో కబ్జాకు యత్నించారు. యంత్రాలతో భూమి చదును చేయిస్తుండగా.. అభ్యంతరాలు రావడంతో వెనక్కి తగ్గారు. రెవెన్యూ శాఖ హెచ్చరిక బోర్డులు పెట్టినా లెక్క చేయకుండా... తాజాగా ఇదే భూముల్లో అర్ధరాత్రి వేళ చదును చేస్తున్నారు. ఈ భూమిలోకి ఎవరూ చొరబడకుండా చుట్టూ కందకాలు తవ్వేందుకు జేసీబీలు తీసుకెళ్లిన తహసీల్దార్‌ను బెదిరించి పంపించేశారు. అధికారిక ఒత్తిళ్లు తారస్థాయికి చేరడంతో.. భూదాన బోర్డు ఛైర్మన్‌తోపాటు C.C.L.Aకు కలెక్టర్‌ ఇటీవల లేఖ రాశారు.

కాకినాడ శివారు దుమ్ములపేట సమీపంలో మడ అడవులను ధ్వంసం చేసి చదును చేసిన ప్రాంతాన్ని కబ్జా చేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఆ స్థలాన్ని లారీ స్టాండ్‌గా మార్చేసి.. పోర్టు, ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు వచ్చే లారీల నుంచి అద్దె వసూలు చేయాలనుకున్నారు. కాకినాడ గ్రామీణం వాకలపూడి పంచాయతీ పరిధిలో గతంలోనే లేఅవుట్‌ వేసి ప్లాట్ల అమ్మకాలు జరిగిన ఐదు ఎకరాల ప్రాంతాన్ని అధికార బలంతో లాగేసుకున్నారు. 1950లో భూయజమాని కుటుంబీకులతో జరిగిన వెయ్యి లావాదేవీల పత్రాలు చూపించి, ప్రస్తుతం 20 కోట్ల విలువైన భూమిని సొంతం చేసుకున్నారు. కడప నుంచి వచ్చిన వ్యక్తులకు ఈ నాయకుడి అండ ఉండటంతో వారిదే పైచేయి అయింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగినా న్యాయం జరగలేదు. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. ఖాళీగా ఉన్న పోర్టు భూములను గుర్తించి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నగర శివార్లలో 45 కోట్ల విలువైన ఏడెకరాల భూమి చదును చేయించారు. వ్యవహారం రచ్చకెక్కడంతో వెనక్కి తగ్గారు.

బియ్యం డాన్‌: రాష్ట్రవ్యాప్తంగా ‘బియ్యం మాఫియా’కు కర్త, కర్మ, క్రియ అంతా ఈ నాయకుడేనని పేరొందారు. బియ్యానికి సంబంధించిన శాఖలో ఈయన సంబంధీకుడు కీలక ప్రభుత్వ పదవిలో ఉన్నారు. పేదలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యాన్ని వీధుల్లో తిరిగే చిరు వ్యాపారుల ద్వారా అతి తక్కువ ధరకు కొనుగోలు చేయిస్తారు. వాళ్ల నుంచి బియ్యం సేకరించి నేరుగా కాకినాడకు తీసుకొస్తారు. గమ్యస్థానం చేరుకునేదాకా ఎక్కడా ఈ వాహనాలను తనిఖీలు చేసేందుకు ఎవరూ సాహసం చేయరు. ఇలా సేకరించిన బియ్యాన్ని పాలిష్‌ చేసి, ఏటా లక్షల టన్నులను పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తూ... అక్రమంగా కోట్లు ఆర్జిస్తున్నారు. పోర్టుకు సరకుతో వెళ్లే వాహనాల తనిఖీకి ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి అక్రమాలను అడ్డుకోవాలని గతంలో జిల్లా జేసీ ప్రభుత్వానికి నివేదిక పంపినా కార్యరూపం దాల్చలేదు.

ఆసుపత్రుల నుంచీ వాటాలు: కొవిడ్‌ సమయంలో కొన్ని ఆసుపత్రుల నుంచి ఈ నాయకుడి అనుచరులు పెద్దఎత్తున వాటాలు వసూలు చేశారు. ప్రజలు చావుబతుకుల మధ్య అల్లాడిపోతే.. వారి నుంచి వసూలు చేసిన ఫీజుల్లో కూడా వాటాలు తీసుకున్నారు. కొవిడ్‌ క్వారంటైన్‌ సెంటర్‌ కోసం కొనుగోలుచేసి పక్కన పెట్టిన మంచాలు, పరుపులు, ఇతర సామగ్రిని.. రెండు సంవత్సరాల కిందట పాదయాత్రకు వాడుకున్నారు.

వారి అనుమతి ఉంటేనే కేసు: పోలీస్‌స్టేషన్లలో పంచాయతీలన్నీ ఈయన సోదరుడు, మరో కీలక అనుచరుడు చక్కబెడుతుంటారు. వాళ్లు అనుమతిస్తేనే కేసు నమోదు చేయాలి. వద్దంటే ఆపేయాలి. కాదని ముందుకెళ్లి అధికారిని వెంటనే బదిలీ చేయిస్తారు. గతంలో ఉన్నతాధికారి ఆదేశించారని ఈ నాయకుడి మద్దతున్న వ్యక్తిని ఓ సీఐ పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. నా సోదరుడి మాటకే ఎదురుతిరుగుతాడా అంటూ సీఐపై మండిపడుతూ... ఎస్పీ చెప్పినా వినకుండా ఆగమేఘాలపై వీఆర్‌కు పంపించేవరకు నిద్ర పోలేదు. అధికార పార్టీ నాయకుడి సహకారంతో విశాఖపట్నం మన్యం నుంచి పెద్దఎత్తున గంజాయి తీసుకొస్తున్న ఈయన అనుచరులు.. యథేచ్ఛగా చీకటి వ్యాపారం చేస్తున్నారు.

అక్రమాలన్నీ వారితోనే..: అక్రమ దందాలు, అరాచకాల బాధ్యతలను కీలక అనుచరుల్లో ఒక్కొక్కరికి ఒక్కోటి అప్పగించారు. పోర్టు ఆధారంగా జరిగే అక్రమాలు, పోలీస్‌స్టేషన్లలో సెటిల్‌మెంట్లు, బియ్యం మాఫియా లాంటివన్నీ సొంత సోదరుడే చూస్తారు. ప్రతిపక్షాలపై దాడులు, వారిని భయభ్రాంతులను చేయడానికి అవసరమైన జనాన్ని సమీకరించడం, కమీషన్లు వసూలు చేసే బాధ్యతను... వినాయకుడి పేరు కలిగిన ఓ అనుచరుడికి అప్పగించారు. బ్రదర్స్‌గా పేరొందిన వారిలో ఓ ముగ్గురు భూముల సెటిల్‌మెంట్లు, కబ్జాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మట్టి, ఇతర గనుల అక్రమ తవ్వకాల్లో ఓ హోటల్‌ యజమానిది కీలక పాత్ర. ఓ మహిళా నాయకురాలి భర్త నగరపాలక సంస్థ పరిధిలోని వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.