Avinash Bail Petition Case today updates: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ నేటికి వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరుకు తెలంగాణ హైకోర్టు నిన్న విచారణ జరిపింది. విచారణలో భాగంగా విచారణకు ఎంత సమయం పడుతుందని న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ ప్రశ్నించగా.. దానికి గంటల సమయం పడుతుందని న్యాయవాదులు తెలిపారు. దీంతో శుక్రవారం వాదనలు వింటామని.. ఈరోజు ఉదయం 10.30 గంటలకు విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ తెలియజేస్తూ.. తదుపరి విచారణను వాయిదా వేశారు.
వివరాల్లోకి వెళ్తే.. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఈరోజుకి వాయిదా వేసింది. కోర్టు సమయం ముగిసే సమయంలో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు రాగా.. వాదనలకు ఎంత సమయం పడుతుందని.. న్యాయమూర్తి పిటిషనర్‌తోపాటు సీబీఐ, కేసులో ఇంప్లీడ్ అయిన సునీత తరపు న్యాయవాదులను ప్రశ్నించారు. దీంతో వాదనలకు గంట సమయం పడుతుందని సీబీఐ తరపు న్యాయవాది తెలుపగా.. పిటిషనర్ వాదనలను బట్టి తమకు సమయం పడుతుందని.. సునీత తరపు న్యాయవాది చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పదిన్నరకు విచారణ జరుపుతామని.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు ప్రత్యేకంగా ఈ ఒక్క కేసే విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీం వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మెన్షనింగ్ లిస్టులో ఉంటేనే విచారిస్తామని జస్టిస్ అనిరుధ్, జస్టిస్ సంజయ్ కరోల్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. మెన్షనింగ్ అధికారి ముందుకు వెళ్లాలని ధర్మాసనం సూచిస్తూ.. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో గత రెండు రోజులక్రితం (మే 23) అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నర్సింహా ధర్మాసనం.. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని అవినాష్‌కు సూచించింది. దీంతోపాటు ఈ నెల 25వ తేదీన విచారణ చేపట్టి, పూర్తి ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారించింది. విచారణకు గంట సమయం పడుతుందని సీబీఐ, పిటిషనర్ల తరుపు న్యాయవాదులు తెలుపగా.. శుక్రవారం ఉదయం పదిన్నరకు మరోసారి విచారణ జరుపుతామని.. సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని రేపు ప్రత్యేకంగా ఈ ఒక్క కేసునే విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ పేర్కొంటూ వాయిదా వేశారు.
ఇవీ చదవండి
- CM Jagan on Groups: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
- Venkatrami Reddy vs govt employees ఏపీజీఈఎఫ్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ప్రకటనపై దుమారం.. వాట్సప్ సందేశాల ద్వారా నిరసన
- Bhuma Akhila priya comments 'నంద్యాలలో విచిత్రమైన సంస్కృతి నడుస్తుంది.. త్వరలోనే అన్ని ఆధారాలను వెల్లడిస్తా'