ETV Bharat / bharat

ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన శునకం... ఎన్​కౌంటర్​లో ఇద్దరు హతం - జమ్ముకశ్మీర్ లేటెస్ట్ న్యూస్

JK Encounter : జమ్ముకశ్మీర్​లో ఇద్దరు ముష్కరుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మృతులు.. లష్కరే తొయిబా సంస్థకు చెందినవారని అధికారులు తెలిపారు. వీరిని మట్టుబెట్టడంలో ఓ శునకం కీలక పాత్ర పోషించింది.

jk encounter
ఎన్​కౌంటర్
author img

By

Published : Oct 10, 2022, 10:20 PM IST

Updated : Oct 10, 2022, 10:43 PM IST

JK Encounter : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా అనంతనాగ్‌ జిల్లాలోని తంగ్‌పావా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు తెలపారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు తంగ్‌పావా ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి గాలింపు చేపట్టారు.

jk encounter
.
jk encounter
ఉగ్రవాదులపై దాడి చేసిన శునకం

ఈ క్రమంలో సోమవారం ఉదయం భద్రతాబలగాలకు ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. గాలింపు ప్రక్రియలో భాగంగా భద్రతా బలగాలకు చెందిన ఓ శునకం తీవ్రంగా గాయపడింది. ఇళ్లలో నక్కి ఉన్న ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చిన జూమ్‌ అనే శునకాన్ని ఈ తరహా ఆపరేషన్‌లో ఉపయోగిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. శునకాన్ని చూసిన ఉగ్రవాదులు దానిపై కాల్పులు జరపడం వల్ల అది తీవ్రంగా గాయపడిందని.. అయినప్పటికీ ఎంతో ఉపయోగపడిందని వివరించారు. దాన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు.

  • #WATCH | In an operation in Kokernag, Anantnag, Army's dog 'Zoom' attacked terrorists & received 2 gunshot injuries. In spite of that, he continued his task which resulted in neutralisation of 2 terrorists. The canine is under treatment in Srinagar, J&K.

    (Source: Chinar Corps) pic.twitter.com/D6RTiWqEnb

    — ANI (@ANI) October 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: భర్తతో వివాదం.. ముగ్గురు పిల్లలతో బావిలో దూకిన తల్లి.. మట్టి దిబ్బ కూలి ఆరుగురు మృతి

శివసేన వర్గాలకు కొత్త పేర్లు.. ఠాక్రే పార్టీకి 'కాగడా' గుర్తు.. ఈసీ నిర్ణయం

Last Updated : Oct 10, 2022, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.