ETV Bharat / bharat

JEE Advanced 2021: 'జేఈఈ​' దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. - జేఈఈ మెయిన్ ర్యాంకులు ఎప్పుడు?

ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్​డ్(JEE Advanced 2021) పరీక్షల దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది. మెయిన్స్​లో(Jee Mains) అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత ప్రక్రియ వాయిదా పడినట్లు తెలిసింది.

Jee Advanced
Jee Advanced
author img

By

Published : Sep 11, 2021, 7:43 AM IST

ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్​డ్(Jee Advanced 2021) పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. జేఈఈ మెయిన్(Jee Mains) ర్యాంకుల వెల్లడిలో జాప్యం వల్ల అడ్వాన్స్​డ్ ప్రక్రియ వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ(Jee Advanced Registration) షెడ్యూల్​లో మార్పులు చేసినట్లు ఐఐటీ ఖరగ్​పుర్ ప్రకటించింది.

ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. ఈ నెల 19 సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్లు ముగియనున్నాయి. ఫీజు చెల్లింపునకు ఈ నెల 20 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3న పరీక్ష యథాతథంగా జరగనుంది.

వాస్తవానికి జేఈఈ మెయిన్ ఫలితాలు(Jee Mains Results) శుక్రవారం విడుదల అవుతాయని అభ్యర్థులు ఎదురు చూశారు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

హరియాణాలో అక్రమాలు జరిగినట్టు సీబీఐ(Cbi Jee News) తేల్చినందున ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను పక్కన పెట్టేందుకు ఫలితాల విడుదల జాప్యమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఎలాంటి ప్రకటన ఇవ్వక పోవడంపై విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.