ETV Bharat / bharat

నదిలోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి - లోయలో పడ్డ కారు

Over a dozen passengers feared dead in Marwa
నదిలోకి దూసుకెళ్లిన సుమో
author img

By

Published : Nov 16, 2022, 7:34 PM IST

Updated : Nov 16, 2022, 11:00 PM IST

19:29 November 16

నదిలోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి

జమ్ముకశ్మీర్ మార్వాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు కారు​ అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిష్త్వార్​ జిల్లాలో.. బుధవారం సాయత్రం మార్వాలోని రాచల్ ప్రాంత సమీపంలో ఓ కారు వాగులో పడిపోయింది. అందులో ఉన్న నలుగురు మహిళలతో సహా ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు.

సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను కారు డ్రైవర్ ​ఉమర్ గని షా.. మహ్మద్ అమీన్, మహ్మద్ ఇర్ఫాన్, అఫాక్ అహ్మద్, ఆసియా బానో, ముజామిలా బానో, సఫూరా బానో, మొహసినా బానోలుగా గుర్తించారు. ఈ ఘటనపై జమ్ము కాశ్మీర్​ లెప్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా, కేంద్ర జితేంద్ర సింగ్​లు స్పందించి మృతులకు సంతాపం తెలిపారు.

Last Updated : Nov 16, 2022, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.