ETV Bharat / bharat

జహంగీర్​పురి​లో మళ్లీ ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి! - ఇరువర్గాల మధ్య రాళ్లదాడి

Jahangirpuri Violence: దిల్లీలోని జహంగీర్​పురి​లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ రాళ్ల దాడుల వరకు వెళ్లింది. అల్లర్లకు కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Jahangirpuri Violence
జహంగీర్​పుర్
author img

By

Published : Jun 8, 2022, 4:04 PM IST

దిల్లీలోని జహంగీర్​పురి​లో మరోమారు అల్లర్లు చెలరేగాయి. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. సీసీటీవీ రికార్డులను పరిశీలించిన పోలీసులు.. నిందితులు విశాల్, వీరూని అరెస్ట్​ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Jahangirpuri Violence
సీసీటీవీలో రికార్డైయిన జహంగీర్​పురి అల్లర్ల దృశ్యాలు

రెండు రోజుల క్రితం తమతో గొడవకు దిగారనే కారణంతో ఇద్దరు యువకులను వెతుకుతూ.. ఓ వ్యక్తి అతని స్నేహితులు జహంగీర్​పుర్​కు వచ్చారు. అప్పటికే వారు మద్యం మత్తులో ఉన్నారు. ఆ సమయంలో ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారు. సమీపంలోని మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Jahangirpuri Violence
దుండగుల దాడిలో కారు అద్దాలు ధ్వంసం

" నిందితులు జహంగీర్​పురికి చెందిన విశాల్, వీరూగా గుర్తించాం. ఈ అల్లర్లలో పాల్గొన్న మిగతావారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం. గొడవలో పాల్గొన్నవారు ఒకే వర్గానికి చెందిన వారు కావడం వల్ల గొడవలో ఎలాంటి మతపరమైన కోణం లేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తదుపరి విచారణ జరుగుతోంది.

-దిల్లీ పోలీసులు

ఇవీ చదవండి: పార్కింగ్ ప్రదేశంలో భారీ అగ్ని ప్రమాదం.. 90 వాహనాలు దగ్ధం

మరో 'నిర్భయ' ఘటన.. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.