ETV Bharat / bharat

ITBP Jobs : ఐటీబీపీలో 458 కానిస్టేబుల్​ పోస్టులకు నోటిఫికేషన్​.. రూ.69 వేలు జీతం! - ఐటీబీపీ కానిస్టేబుల్​ ఉద్యోగాలు 2023

ITBP Jobs : నిరుద్యోగ యువతకు గుడ్​ న్యూస్. ఐటీబీపీ 458 కానిస్టేబుల్​ (డ్రైవర్​​) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

ITBP Driver Recruitment
ITBP Constable Driver Recruitment 2023
author img

By

Published : Jun 25, 2023, 10:42 AM IST

ITBP Jobs 2023 : ఇండో - టిబెటన్​ పోలీస్​ ఫోర్స్​ (ఐటీబీపీ) 458 కానిస్టేబుల్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. వీరు ఒప్పంద ప్రాతిపదికపై డ్రైవర్స్​గా పనిచేయాల్సి ఉంటుంది. అయితే పనితీరు ఆధారంగా వీరిని శాశ్వత ఉద్యోగులుగా కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులు ఐటీబీపీ బలగాల అవసరాల మేరకు భారతదేశంలో లేదా విదేశాల్లో ఎక్కడైనా సేవలు అందించాల్సి ఉంటుంది.

కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు
ITBP Constable vacancy details :

  • యూఆర్​ - 195
  • ఈడబ్ల్యూఎస్​ - 45
  • ఓబీసీ - 110
  • ఎస్సీ - 74
  • ఎస్టీ - 37

విద్యార్హతలు
ITBP Driver Education Qualification : ఐటీబీపీ కానిస్టేబుల్​ (డ్రైవర్​) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు.. ప్రభుత్వ గుర్తింపు పొంది బోర్డ్​ నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే కచ్చితంగా చెల్లుబాటులో ఉన్న హెవీ వెహికల్​ డ్రైవింగ్​ లైసెన్స్​ కలిగి ఉండాలి.

వయోపరిమితి
ITBP Driver Age Limit : 2023 జులై 26నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. 1996 జులై 27 నుంచి 2002 జులై 26 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది.

దరఖాస్తు రుసుము
ITBP Constable Application Fee : యూఆర్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము​ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం
ITBP Driver Selection Process : ఐటీబీపీ కానిస్టేబుల్​ (డ్రైవర్​) ఎంపిక విధానం 5 స్టేజ్​లుగా ఉంటుంది. ​

1. శరీర దారుఢ్య పరీక్ష (పీఈటీ/పీఎస్​టీ) : అభ్యర్థులకు ఫిజికల్​ ఎఫీషియన్సీ టెస్ట్​ (పీఈటీ), ఫిజికల్​ స్టాండర్డ్​ టెస్ట్​ (పీఎస్​టీ) నిర్వహిస్తారు.

2. రాత పరీక్ష : శరీర దారుఢ్య పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.

3. డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ : రాతపరీక్షలో నెగ్గిన అభ్యర్థుల డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ చేస్తారు.

4. డ్రైవింగ్​ టెస్ట్​ : ఈ దశలో అభ్యర్థుల డ్రైవింగ్​ సామర్థ్యాలను, నిపుణతను పరీక్షిస్తారు.

5. మెడికల్​ టెస్ట్​ : డ్రైవింగ్​ టెస్ట్​లో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులకు చివరిగా మెడికల్​ టెస్ట్​లు చేస్తారు.

జీతభత్యాలు
ITBP Driver Salary : కానిస్టేబుల్ (డ్రైవర్​) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.21,700 నుంచి రూ .69,100 (లెవెల్​-3) వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం
ITBP Constable Application process :

  • ఆసక్తి గల అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్​సైట్​ https://www.itbpolice.nic.in/ ను ఓపెన్​ చేయాలి.
  • కానిస్టేబుల్​ (డ్రైవర్​) పోస్టు దరఖాస్తును పూర్తిగా నింపాలి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్స్​ను అప్​లోడ్​ చేయాలి.
  • దరఖాస్తు రుసుమును ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • చివరిగా అప్లికేషన్​ను సబ్​మిట్ చేసి, దాని కాపీని ప్రింట్​ చేసి, రిఫరెన్స్​గా దగ్గర ఉంచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల స్వీకరణ మొదలయ్యే తేదీ : 2023 జూన్​ 27
  • దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ : 2023 జులై 26

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.