Inter Student Suicide in Visakha: విశాఖలో 'బేబీ' సినిమా తరహా ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రేమ కథ.. మైనర్ బాలిక, యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. మరో యువకుడిని కటకటాలపాలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన సూసైడ్ నోట్ కీలకంగా మారడంతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి.. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అసలేం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జీవీఎంసీ 89వ వార్డు పరిధిలో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని(17)కి.. ఇందిరా నగర్‌కు చెందిన డ్యాన్సర్ సాయికుమార్(23), ఆదర్శనగర్‌కు చెందిన సూర్యప్రకాశరావు(25)తో బాలికకు పరిచయం ఏర్పడింది. వారిలో సాయికుమార్‌తో సదరు బాలిక తాళికట్టించుకున్న వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతోపాటు సూర్యప్రకాశరావుతోనూ బాలిక సన్నిహితంగా ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే బాలిక ఒకరి తెలియకుండా మరొకరితో సాగిస్తోన్న ప్రేమ వ్యవహారం బయటపడటంతో.. ఇద్దరు యువకులు బాలిక ఇంటి వద్దకు వెళ్లి.. ఆమెకు ఎవరు కావాలో..?ఎవరితో ఉంటుందో..? తేల్చుకోమని హెచ్చరించారు.
Couple Suicide Attempt: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో వైరల్..!
దీంతో ఏం చేయాలో అర్థంకాని బాలిక తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఈ నెల 10న ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మైనర్ బాలిక మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. అందులో.. 'సూర్య.. వాళ్లెవరినీ వదలకు.. కుక్క చావు చావాలి కొడుకులు..' అని రాసిపెట్టి ఉంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలికను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న సూర్యప్రకాశ్ గురువారం రాత్రి అకస్మాత్తుగా అదృశ్యమైయ్యాడు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం గోపాలపట్నం సమీప రైల్వే పట్టాలపై శవమై కనిపించాడంతో.. ఈ కథలో రెండో ఆత్మహత్య నమోదు అయ్యింది.
ఒకే చున్నీ కట్టుకుని.. నదిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య!
అయితే మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు కనిపించకపోవటంతో.. గుర్తు తెలియని వ్యక్తి మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి.. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని కేజీహెచ్‌కు తరలించారు. అయితే అది సూర్యప్రకాశ్ రావు మృతదేహంగా అతడి కుటుంబీకులు గుర్తించారు. దీంతో సూర్యప్రకాశ్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. బాలిక ఆత్మహత్య నేపథ్యంలో భయపడి బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని బంధువులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనలో మరో నిందితుడు సాయికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే పోలీసులకు లభించిన సూసైడ్ నోట్లో 'సూర్య.. వాళ్లెవరినీ వదలకు.. కుక్క చావు చావాలి..' అని రాసిఉన్న దానిలో మిస్టరీ మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. బాలిక ఎవరిని వదొలొద్దు అంది..?ఎవరిని ఉద్దేశించి.. కుక్క చావు చావాలని కోరుకుంది..? అనే ప్రశ్నలు నెటిజన్లలో తలెత్తుతున్నాయి.