ETV Bharat / bharat

చీతాలకు ఇంత వేగం ఎలా? శరీరంలోని ఆ ప్రత్యేకతలే కారణమా? - చీతాల స్పీడ్​

Cheetah Body Structure : అరుదైన వన్యప్రాణులైన చీతాలు సుధీర్ఘ కాలం తర్వాత భారత్‌కు వచ్చాయి. నమీబియాలోని విండ్‌హాక్‌ నుంచి తీసుకొచ్చిన చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్​ గ్వాలియర్ సమీపంలోని కునో నేషనల్ పార్కులోకి విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రకృతి తీర్చిదిద్దిన ఈ పరుగుల యంత్రం దేహనిర్మాణ క్రమాన్ని పరిశీలిద్దాం.

cheetah speed
cheetah speed
author img

By

Published : Sep 18, 2022, 10:13 AM IST

Cheetah Body Structure : నేలపై అత్యంత వేగంగా పరుగెత్తగల జీవిగా గుర్తింపు పొందిన చీతాలు సుదీర్ఘకాలం తర్వాత భారతావనిలో కాలుమోపాయి. ఈ అద్భుత జంతువులు ఇక మన దేశంలో కనువిందు చేయనున్నాయి. మెరుపు వేగానికి పర్యాయపదంగా మారిన ఈ జీవులు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఉరకగలవు. ఒలింపిక్‌ ఛాంపియన్‌ ఉసేన్‌ బోల్ట్‌ గరిష్ఠ పరుగు వేగం గంటకు 44.72 కిలోమీటర్లు. ఒక్క ఉదుటులో చీతా ఏడు మీటర్ల దూరాన్ని అధిగమించగలదు. సెకనులో నాలుగు అంగలు వేయగలదు. మూడు సెకన్లలోనే గరిష్ఠ వేగాన్ని అందుకోగలదు. ఇంత అద్భుత సామర్థ్యానికి దోహదపడేలా తయారైన ఈ జీవి దేహనిర్మాణం చాలా ప్రత్యేకం.
చీతా శరీరం చిన్నగా.. నడుం భాగం సన్నగా ఉంటుంది. పెద్ద ఊపిరితిత్తులు, గుండె, నాసిక మార్గాలు, సులువుగా వంగే వెన్నెముక, పొడవైన కాళ్లు, పెద్ద తోక వల్ల ఇది ఇంత వేగాన్ని అందుకుంటోంది.

కండరాలు: చీతా శరీర బరువులో కండరాల వాటా 50 శాతం. అందులోనూ చాలా భాగం ప్రత్యేకమైన 'ఫాస్ట్‌ ట్విచ్‌ ఫైబర్ల'తో రూపొందింది. ఈ రకం ఫైబర్లు చాలా వేగంగా, శక్తిమంతంగా సంకోచిస్తాయి. చీతా వెనుక కాళ్ల పైభాగంలోని కండరాల్లో 80 శాతం వీటితోనే తయారయ్యాయి. ఈ జీవి నడుం భాగంలోని సోయాస్‌ కండరం పెద్దగా ఉంటుంది. ఈ కాళ్లు బాగా వెనక్కి సాగి, అదేరీతిలో చాలా త్వరగా ముందుకు దూసుకొచ్చేలా ఇది సాయపడుతుంది. పెద్ద అంగ పడేలా తోడ్పాటు అందిస్తుంది.

పాదం: చీతా పాదాలు దృఢంగా ఉంటాయి. పులులతో పోలిస్తే అవి పూర్తి గోళాకారంలో ఉండవు. వాహనాల టైర్ల త్రెడ్ల తరహాలో పట్టును అందిస్తాయి. చీతాల పాదంలో నేలను తాకే భాగం తక్కువ. గోళ్లు పాక్షికంగా వెనక్కి రాగలవు. అథ్లెట్ల బూట్ల దిగువ భాగంలోని మేకుల్లా (ట్రాక్‌ క్లీట్స్‌) ఇవి పనిచేస్తాయి. పరుగెత్తేటప్పుడు పాదం ముందు భాగానికి అదనపు పట్టును అందిస్తాయి. చీతా పాదంలోని ఐదో వేలు.. కొంచెం పైభాగంలో ఉంటుంది. వేటాడుతున్న జీవిని కాలితో లాగి పడదోసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

వెన్నెముక: చీతాల వెన్నెముక చాలా పొడవుగా ఉంటుంది. అది ఎటుపడితే అటు కదలగలదు. పరుగులో భాగంగా కాళ్లు వెనక్కి వెళ్లినప్పుడు వెన్నెముక బాగా సాగుతుంది. కాళ్లు తిరిగి ముందుకొచ్చినప్పుడు అది ఒక స్ప్రింగ్‌లా ముడుచుకుపోగలదు.
చీతాల భుజంలోని బ్లేడ్‌ భాగం.. కాలర్‌ ఎముకకు అనుసంధానమై ఉండదు. అందువల్ల ఆ భాగం సులువుగా కదులుతుంది.

వేడి తగ్గించుకుంటూ.. :ఉరికేటప్పుడు చీతా శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. నోరు, పాదాల ద్వారా దీన్ని తగ్గించుకుంటుంది. చీతాల చర్మంపై ఉండే నల్లటి మచ్చలు కూడా వేడిని బయటకు పంపడానికి ఉపయోగపడతాయి. ఆ భాగాల్లోని రోమాలు ఒకింత పొడవుగా ఉంటాయి.
చీతాలు ఒక విడతలో 30 సెకన్ల పాటే గరిష్ఠ వేగాన్ని సాధించగలవు. ఆలోపే జంతువును వేటాడాలి. అందుకే వేటలో చీతాల విజయాలు 40-50 శాతమే ఉంటాయి. వేటాడాక దాదాపు అరగంట పాటు సేద తీరాకే ఆహారాన్ని భుజిస్తాయి.

గాలిని చీల్చుకుంటూ..

.
  • పరుగులో ఒక దశలో చీతా నాలుగు కాళ్లూ ఏకకాలంలో గాల్లోనే ఉంటాయి.
  • పరుగెత్తే సమయంలో చీతా ఆకృతి మొత్తం ఏరోడైనమిక్స్‌కు అనుగుణంగా ఉంటుంది. గాలి నిరోధకతను తగ్గించుకుంటుంది. ఇందులో భాగంగా చెవులు వెనక్కి మళ్లుతాయి.
  • ఉరికేటప్పుడు చీతా శరీరమంతా కదులుతున్నా తల స్థిరంగా ఉంటుంది. తాను వేటాడుతున్న జీవిపైనే కళ్లు కేంద్రీకృతమై ఉంటాయి.

స్థిరత్వాన్ని ఇచ్చే తోక: చీతాల తోకభాగం.. దాని మిగతా శరీరం పొడవులో 50 శాతాన్ని కలిగి ఉంటుంది. ఇది చుక్కానిలా పనిచేస్తుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సమయంలోనూ ఒడుపుగా మలుపులు తిరగడంలో ఇది సాయపడుతుంది. సమతౌల్యం కోల్పోకుండా చూస్తుంది. అందువల్ల చీతాలు జిగ్‌జాగ్‌ మార్గంలోనూ అలవోకగా పరుగెత్తగలవు.

ఊపిరి, రక్తప్రసరణ..: చీతాల నాసిక మార్గాలు పెద్దగా ఉంటాయి. అందువల్ల అవి ఎక్కువ ఆక్సిజన్‌ను తీసుకోగలవు. ఈ జీవి ఛాతీ ఎముక.. మిగతా కండరాలకు అంతబాగా అనుసంధానమై ఉండదు. అందుకే దీన్ని తేలియాడే ఛాతీ ఎముక (ఫ్రీ ఫ్లోటింగ్‌ బ్రెస్ట్‌బోన్‌) అంటారు. వీటి ఛాతీ కుహరం భారీ వ్యాకోచానికి అనువుగా ఉంటుంది. అందువల్ల ఉరికేటప్పుడు ఊపిరితిత్తులు బాగా సాగడానికి వీలవుతుంది.

  • పరుగెత్తేటప్పుడు మానవ శ్వాస రేటు నిమిషానికి 20-50 సార్లు
  • చీతా శ్వాస రేటు నిమిషానికి 150 సార్లు
.
  • చీతాల గుండె, రక్తనాళాలు పెద్దగానే ఉంటాయి. చాలా సమర్థంగా శరీరమంతంటికీ ఆక్సిజన్‌ సరఫరా చేస్తాయి.
  • చీతాలకు ప్రత్యేకత తెచ్చేది వాటి కళ్లకు దిగువ భాగంలోని నల్లటి చారలే. కళ్లను సూర్యుడి వెలుగు నుంచి రక్షించడంలో అవి కీలక పాత్ర పోషిస్తుంటాయి.
  • చీతాల చర్మం బంగారు వర్ణంలో ఉంటుంది. వాటిపై నల్లటి మచ్చలు ఉంటాయి. చిరుత, జాగ్వార్‌ల చర్మంతో పోలిస్తే ఇది భిన్నం. ఈ ప్రత్యేక డిజైన్‌ను ఉపయోగించుకొని చీతాలు పరిసరాల్లో కలిసిపోతుంటాయి.
  • పులుల తరహాలో చీతాలు గాండ్రించలేవు. చిన్నపాటి కూత మాత్రమే పెట్టగలవు.
  • చీతాలు 2-5 రోజులకోసారి వేటాడుతాయి. 3-4 రోజులకోసారి నీరు తాగుతాయి. ఉదయం, సాయంత్రంపూట వేటాడుతుంటాయి.
  • చీతాల పిల్లల్లో మరణాల రేటు అధికం. పుట్టిన కొద్దివారాల్లోనే 90 శాతానికిపైగా మృత్యువాత పడుతుంటాయి. ఇతర జంతువులు వాటిని చంపేయడం, గాయాల వంటివి ఇందుకు ప్రధాన కారణం.
.

ఇవీ చదవండి; దేశంలో చీతాల సందడి షురూ.. చూసేందుకు ఇప్పుడే రావొద్దన్న మోదీ!

74 ఏళ్ల తరువాత దేశంలోకి చీతాలు.. మోదీ బర్త్​డే రోజున ఆ పార్క్​లోకి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.